Trivikram: పూజాకు క్యారెక్టరే కాకుండా.. కారు కూడానా..?

సినిమా ఇండస్ట్రీ లో పుకార్లు రావడం చాలా సాధారణం. ఈ పుకార్లు నటీనటుల వ్యక్తిగత జీవితాన్ని డ్యామేజ్ చేసే విధంగా కూడా ఉంటాయి. ఈ క్రమంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కు మధ్య ఎదో సంబంధం ఉందంటూ ఇప్పటికే చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై ట్రోల్స్, మీమ్స్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి.

త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజా బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలకు సైన్ చేసిందని, ఆయన భాగస్వామ్యంగా ఉన్న ప్రొడక్షన్ హౌసెస్ తో సినిమాలు చేస్తుందని నెటిజన్స్ చెప్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజ హెగ్డే ఇప్పటికే 2018లో ‘అరవింద సమేత’, 2020లో ‘అలా వైకుంఠపురంలో..’తో పాటు తాజా గా ‘SSMB28’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది.

ఇది ఇలా ఉండగా, గత కొన్ని రోజుల నుంచి త్రివిక్రమ్, పూజా హెగ్డేల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే… SSMB28 షూటింగ్ కి పూజ హెగ్డే రావటానికి త్రివిక్రమ్ 2 కోట్ల విలువైన లగ్జరీ కారును కొనుగోలు చేసాడంట. ప్రస్తుతం పూజా హెగ్డే షూటింగ్ సెట్ కి అదే కారు లో వస్తుంది అని వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

ఈ వార్తలో అసలు నిజం ఏంటి అంటే.. SSMB28 ను హారిక అండ్ హసిని సితార ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం నటి నటులను షూటింగ్ సెట్ కు తీసుకురావటానికి ఇప్పటి వరకు అద్దె కార్లను ఉపయోగించారు. దీనికి ఎక్కువ ఖర్చు అవుతుందని ఈ నిర్మాణ సంస్థలు సొంతంగా కార్లను కొనుగోలు చేసాయి. అందులో భాగంగానే పూజ హెగ్డే కి ఒక కారును కేటాయించారు. దీంతో పూజా హెగ్డే కి త్రివిక్రమ్ కారు కొనుగొలు చేసాడని వార్తలు బయటకి వచ్చాయి. కానీ ఇదే అసలు నిజం. అయితే ఈ రెండు నిర్మాణ సంస్థల్లో త్రివిక్రమ్ కు పెట్టుబడులు ఉన్నట్టు అందరూ చెప్పే మాట.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు