Allu Arjun: అసలేం జరుగుతోంది పుష్ప..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో పుష్ప సినిమాకి సీక్వెల్ గా పుష్ప2 సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. చాలా కాలం కిందట షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాకు సంబంధించి అప్పట్లో రిలీజ్ అయిన గ్లిమ్ప్స్ మినహా ఎటువంటి అప్డేట్ లేకపోవటంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో సహా నార్మల్ ఆడియెన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను సుకుమార్ ఫారిన్ ఆర్టీసిస్ట్స్ తో హాయ్ రేంజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకూడదు అన్నది దర్శకుడు సుకుమార్ ప్లాన్ అని సమాచారం అందుతోంది. షూటింగ్ మొదలైన నాటి నుండి వివిధ కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా షూటింగ్ తాజాగా మరోసారి వాయిదా పడిందన్న వార్తలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తున్నాయి.

పుష్ప2 సినిమా షూటింగ్ వాయిదా పడటానికి కారణం దర్శకుడు సుకుమార్ అని తెలుస్తోంది. తన కూతురు మ్యూజిక్ క్లాసెస్ క్రాష్ కోర్స్ కోసం అమెరికా వెళ్లిన సుకుమార్ పుష్ప షూటింగ్ ని వాయిదా వేసాడని సమాచారం అందుతోంది. దీంతో ఇప్పటికే విసిగిపోయిన బన్నీ ఫ్యాన్స్ మరింత అసహనానికి లోనవుతున్నారు. ఇప్పటికి 50శాతం షూటింగ్ కూడా పూర్తి కానీ ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుందని కామెంట్ చేస్తున్నారు.

ప్రస్తుతం త్రివిక్రమ్ తో పాన్ ఇండియా సినిమా కమిట్ అయిన అల్లు అర్జున్ ఈ సినిమాను వీలైనంత త్వరగా స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇక పుష్ప2 సినిమా విషయానికి వస్తే, సినిమా రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ అయోమయంలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా అనుకున్నట్టు ఈ ఏడాది డిసెంబర్ కి సినిమా రిలీజ్ చేయటం కష్టం అని ఒకవేళ చేసిన పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవనున్న ఈ సినిమాకి ఆ డేట్స్ సరైనవి కావని అంటున్నారు. మరి, ఫ్యాన్స్ ఎదురు చూపులకి సినిమా యూనిట్ ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు