Mrunal Thakur: నటులు కూడా మనుషులే

బాలీవుడ్ బ్యూటి మృనాల్ ఠాకూర్ తాజాగా టాలీవుడ్ కి డెబ్యూ చేసిన సంగతి తెలిసిందే. ‘సీతారామం’ సినిమాతో సీతగా ట్రెడిషనల్ లుక్స్ తో తెలుగు ఆడియన్స్ ని తన మాయలో పడేసింది మృణాల్ ఠాగూర్. డెబ్యూ ఘనంగా ఉంది. మృణాల్ నటించిన సీతారామం సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు, సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

అయితే ఇదివరకు ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ మీకు కాబోయే వాడు ఎలా ఉండాలని అనుకుంటున్నారు? అని ప్రశ్నిస్తే అందంగా లేకపోయినా పరవాలేదు, మంచివాడుగా ఉంటే చాలు అంటూ చెప్పింది. అయితే ఈమధ్య కపిల్ శర్మ షోలో ఆమె గెస్ట్ గా పాల్గొన్నప్పుడు ఇదే ప్రశ్నలు వేశారు. అందంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ సమాధానం ఇచ్చింది.

అయితే నెటిజన్స్ కొందరు ఈ రెండు సమాధానాలకు సంబంధించి వీడియోలను జత చేస్తూ ఇలా కొన్ని రోజుల్లోనే కాబోయే వాడి గురించి మాట మార్చేయడం కరెక్ట్ కాదంటూ ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. ఎట్టకేలకు ట్రోలింగ్ పై మృణాల్ రియాక్ట్ అయ్యింది. “ఆర్టిస్టులు కూడా మనుషులే. మన చుట్టూ ఉన్నవారు కొత్త విషయాలను నేర్చుకుంటూ తెలివిగా ముందుకు వెళుతున్నారు. అయినా జీవితాంతం ఒకే ఆలోచనకు కట్టుబడి ఉండాలని ఏం లేదు కదా. ఆ విషయాన్ని కొందరు మరిచిపోతుంటారు” అంటూ మృణాల్ ఠాకూర్ కౌంటర్ ఇచ్చేసింది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు