Shradha Kapoor: ప్రతిరోజు ఆ పని చేస్తా

బాలీవుడ్ లో ఉన్న టాప్ స్టార్ లలో శ్రద్ధా కపూర్ ఒకరు. చాలాకాలంగా ఈ భామ సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. ఆషికి – 2 సినిమాతో విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా నిరాశపరచడంతో మళ్ళీ సౌత్ లో సినిమాలు చేయడానికి ముందుకు రాలేదు.

శ్రద్ధ బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కుమార్తె కావడం మరో విశేషం. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈమె సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతుంటాయి. ఇక కమర్షియల్ హీరోయిన్ గానే కాకుండా కథా బలమున్న సినిమాలలోనూ భాగమవుతూ నటిగా తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది శ్రద్ధా కపూర్.

ఈమె తక్కువ సినిమాలలోనే నటించినప్పటికీ స్టార్ రేంజ్ హీరోయిన్ గా ఎదిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తన ఫిట్నెస్ సీక్రెట్స్ ని బయట పెట్టింది. “ఆరోగ్యకరమైన కురుల కోసం డబ్బులు ఖర్చు పెట్టి పార్లర్ల చుట్టూ తిరగను. ఇంట్లో, పెరట్లో లభించే కలబంద గుజ్జు, మందార ఆకులు లేదా పువ్వులు, కాస్త పెరుగుతో చేసిన మిశ్రమాన్ని తలకు రాసుకుంటాను. అలాగే కరోనా సమయంలో జిమ్ లన్నీ మూతపడ్డప్పటికీ నేను వర్కౌట్స్ ని ఆపలేదు. వీడియో కాల్ ద్వారా నా ట్రైనర్ సూచనలతో టెర్రస్ పై ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇక నేను ఫిట్ గా ఉండాలంటే రోజు డాన్స్ చేయాల్సిందే. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. డాన్స్ అనేది బెస్ట్ మెడిసిన్ అని నమ్ముతాను. నేను ఫీట్ గా ఉండడానికి కారణం డాన్స్ చేయడమే ” అని చెప్పింది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు