JR NTR:ఎన్టీఆర్ తన భార్యని ఇంట్లో ఇలా పిలుస్తాడట

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్‌. ఇప్పుడు దేశంలో ఈ పేరు తెలియని వారు ఉండరు `ఆర్‌ఆర్‌ఆర్‌` తో ఆయన ఇమేజ్‌ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులనే కాదు సెలెబ్రెటీలను కూడా ఆయన యాక్టింగ్ ను అభినందిస్తున్నారు. నందమూరి అభిమానులు యంగ్ టైగర్ అని పిలుచుకునే ఎన్టీఆర్ బయట సొసిటీ లో కూడా మంచి వ్యక్తిగా కాంట్రవర్సీ లకు దూరంగా చాలా హుందాగా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రస్తుతం కొరటాల శివ తో మూవీ చేస్తున్న ఎన్టీఆర్, తర్వాత ప్రశాంత్ నీల్ తో చేయనున్నాడు.

ఇదిలా ఉండగా JR ఎన్టీఆర్‌కి 2011లో వివాహం జరిగింది. తన మేనత్త కుమార్తె అయిన లక్ష్మి ప్రణతిని ఆయన వివాహం చేసుకున్నారు. టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ సెలెబ్రిటీ జంటల్లో వీరూ ఒకరు. అయితే లక్ష్మి ప్రణతి పూర్తిగా ప్రైవేట్ లైఫ్ కి పరిమితంగా బయట ఎక్కువగా కనిపించకుండా పూర్తి గృహిణి గా నే ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీరికి ఇద్దరు కుమారులు భార్గవ్‌ రామ్‌, అభయ్‌ రామ్‌. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండరు.

సహజంగా ఎవరైనా తన భార్యలను ముద్దుపేర్లతో పిలుస్తుంటారు. రాంచరణ్ తన భార్యని ఉప్సి అని, అలాగే అల్లు అర్జున్ తన భార్యని బేబీ అని పేర్లతో పిలుస్తూ తమ ప్రేమని వ్యక్తం చేస్తుంటారు. అయితే ప్రణతిని తారక్ ఇంట్లో ఎలా పిలుస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

- Advertisement -

మరి ఎన్టీఆర్‌.. తన భార్య ప్రణతిని ఎలా పిలుస్తాడో అనే విషయం బయటపడింది . మార్చి 26న ప్రణతి పుట్టిన రోజు సందర్భంగా తారక్ తన ఇన్ స్టాగ్రామ్ లో వేసిన పోస్ట్ తో ఇంట్లో ప్రణతిని తారక్ ఏమని పిలుస్తారో అనేది అందరికీ తెలిసిపోయింది. తన ఇన్ స్టాగ్రామ్ లో ప్రణతికి పుట్టన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. హ్యాపీ బర్త్ డే అమ్ములు అని రాసుకొచ్చాడు. దీంతో ప్రణతిని తారక్ ముద్దుగా అమ్ములు అని పిలుస్తాడని అభిమానులకు తెలిసిపోయింది. దీంతో తారక్ అభిమానులు.. “అమ్ములు వదినకు పుట్టిన రోజు శుభాకాంక్షలు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు