TholiPrema: పాతికేళ్లు అయినా  ‘పవర్’ తగ్గని క్లాసిక్ – రీరిలీజ్ కి రెడీ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ కరుణాకరన్ కాంబినేషన్లో వచ్చిన తొలిప్రేమ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా వచ్చి 25ఏళ్లు అవుతున్నా, చుసిన ప్రతిసారి ఫ్రెష్ ఫీల్ ని ఇస్తుంటుంది. ఈ సినిమా సాంగ్స్, కామెడీ, ఎమోషన్, వాట్ నాట్ ప్రతి అంశంలోనూ క్లాసిక్ అని చెప్పవచ్చు. తొలిప్రేమ సినిమాలో లైఫ్ పట్ల సీరియస్ నెస్ లేని కుర్రాడి క్యారెక్టర్లో నటించిన పవన్ కళ్యాణ్, సిన్సియర్ వన్ సైడ్ లవర్ గా, చెల్లెల్ని అమితంగా అభిమానించే అన్నయ్యగా జీవించాడని చెప్పచ్చు. ఈ ప్రస్తావన ఇప్పుడెందుకు అంటే, సినిమా రిలీజ్ 25ఏళ్లు అయిన సందర్బంగా జూన్ 30న రీరిలీజ్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో టాలీవుడ్లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ సినిమాలు ఖుషి, జల్సా, తమ్ముడు వంటి సినిమాలు రీరిలీజ్ అయ్యి థియేటర్లలో సందడి చేశాయి. వీటితో పాటుగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా సెప్టెంబర్ 2న గుడుంబా శంకర్ సినిమాను కూడా రీరిలీజ్ చేస్తున్నారు. గుడుంబా శంకర్, బంగారం వంటి సినిమాలు అప్పట్లో ఆశించిన రేంజ్ లో అలరించలేకపోయినా కూడా అభిమానులు వింటేజ్ పవన్ కళ్యాణ్ స్టైల్ ని మరోసారి సిల్వర్ స్క్రీన్ మీద చూడటం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పచ్చు.

తొలిప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించిన కీర్తి రెడ్డిని ఆ ఒక్క సినిమాతోనే ఇప్పటికీ  ప్రేక్షకులు  గుర్తు పెట్టుకున్నారంటే, ఆ సినిమాలోని హీరోయిన్ ఇంట్రొడక్షన్ సీన్ కారణం అని చెప్పాలి. కరుణాకరన్ విజువలైజేషన్ ని దేవా ఇచ్చిన బీజీఎమ్ ఇంకో లెవెల్ కి తీసుకెళ్లిందని చెప్పాలి. హీరోయిన్ ఇంట్రో సీన్స్ లో ట్రెండ్ క్రియేట్ చేసిన ఆ సీన్ ని చాలా సినిమాల్లో ఫాలో అయ్యారు. మరి, 25ఏళ్ళ తర్వాత రీరిలీజ్ అవుతున్న ఈ క్లాసిక్ ఏ మేరకు సందడి చేస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు