Aarthi Agarwal Birth Anniversary: కడకాలం కష్టాలే…

ఆర్తి అగర్వాల్… ప్రస్తుతం కాలం అంతగా పరిచయం లేకపోవచ్చు. కానీ, 2001 నుంచి 2005 వరకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఈమె. ఆర్తి అగర్వాల్ 2001లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనలో, విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నాకు నచ్చవ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమాకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలే కాకుండా, కమర్షియల్ గా కూడా హిట్ అయింది.

మొదటి సినిమానే పెద్ద విజయం కావడంతో ఆర్తి అగర్వాల్ పట్టిందల్లా బంగారమే అన్నట్టు అవకాశాలు వచ్చాయి.. అలాగే హిట్స్ వచ్చాయి. ఆమె కెరీర్ లో నువ్వు నాకు నచ్చావ్, నువ్వు లేక నేను లేను, వసంతం, ఇంద్ర, అందాల రాముడు, నీ స్నేహం లాంటి ఎన్నో క్లాసీ హిట్స్ ఉన్నాయి.

పెద్ద హీరోయిన్ అవుతుంది అనుకునే సమయంలో కొన్ని వ్యక్తిగత విషయాల వల్ల కెరీర్ పై ప్రభావం పడింది. తరుణ్ తో లవ్ ట్రాక్ రూమర్స్ ఆర్తి అగర్వాల్ సినీ కెరీర్ నే మలుపుతిప్పింది. దీని నుంచి తేరుకుని 2007లో న్యూజెర్సీకి చెందిన ఉజ్వల్ నికమ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత అమెరికాకు షిప్ట్ అయి సినిమాలకు దూరమైంది. కానీ, అక్కడ కూడా ఈమెకు కష్టాలు తప్పలేదు. ఉజ్వల్ తో మనస్ఫర్థలు రావడంతో వినిపోయింది.

- Advertisement -

మళ్లీ ఇండస్ట్రీకి వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. కానీ, సెకండ్ ఇన్నింగ్స్ తో ఎదుగుతున్న క్రమంలో హార్ట్ ఎటాక్ తో మరణించింది. ఇలా ఆర్తి అగర్వాల్ మొదటి నుంచి కష్టాలను అనుభవిస్తూనే వచ్చింది.

For More Updates : 

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు