Adi Purush: ప్రభాస్ సినిమాకి అరుదైన గొప్ప అవకాశం

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న భారీ మైథలాజికల్ మూవీ “ఆది పురుష్”. తానాజీ సినిమా తీసిన ఓం రౌత్ ఈ మూవీ ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీకి అజయ్ – అతుల్ మ్యూజిక్ అందించారు. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, అలాగే దేవదత్త నాగే హనుమంతుడిగా, సైఫ్ ఆలీ ఖాన్ రావణుడిగా గా నటిస్తున్నారు. రెట్రో ఫైల్స్, టి సిరీస్ ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా ఎంతో భారీ స్థాయిలో 500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఆదిపురుష్ పై మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచినా, ఈ మూవీ నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ లుక్ టీజర్ విజువల్స్ అంతగా ఆకట్టుకోకపోవడం తో మూవీ టీమ్, ఈ సినిమా లో కొంత భాగం రీ షూట్ చేస్తున్నారు. ఇంకా గ్రాఫిక్స్ పైనా బాగా కసరత్తులు చేస్తున్నారు.

అయితే విషయం ఏమిటంటే, ఆదిపురుష్ మూవీని జూన్ 13న అమెరికాలోని న్యూయార్క్ లో జరిగే “ట్రిబెకా ఫెస్టివల్” లో స్పెషల్ ప్రీమియర్ గా ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ ఏప్రిల్ 18 న అఫీషియల్ గా ప్రకటించింది. జూన్ 7 నుండి 18 వరకు ఈ ఫెస్టివల్ వైభవంగా జరుగనుంది.

ట్రిబెకా ఫెస్టివల్, కళాకారులు మరియు విభిన్న ప్రేక్షకులను ఒకచోట చేర్చి అన్ని రకాల సినిమాలను, ప్రోగ్రామ్స్ ను ప్రదర్శిస్తూ జరుపుకుంటారు. విజువల్ ఫీస్ట్‌గా ఆదిపురుష్ 3డి ఫార్మాట్‌లో మిడ్‌నైట్ ఆఫరింగ్ గా ఈ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడుతుంది. కాగా ఇది భారతీయ సినిమా అయిన ఆదిపురుష్ కి దక్కిన గొప్ప అవకాశం అని భారతీయ సినీ ప్రముఖులు అంటున్నారు. ఈ విషయమై నిర్మాత భూషణ్ కుమార్, హీరో ప్రభాస్ మాట్లాడుతూ, ట్రిబెకా ఫెస్టివల్ లో మా సినిమా ప్రదర్శితం కావడం కేవలం మా మూవీ యూనిట్ కి మాత్రమే కాదు, ఇండియన్ సినీ అభిమానులకి కూడా గర్వకారణం అన్నారు.

- Advertisement -

ట్రిబెకా ఫెస్టివల్ లో ఆది పురుష్ మూవీ కి హాలీవుడ్ ఆడియన్స్ కనెక్ట్ అయితే ఆ సినిమా ఓవర్సీస్ లో RRR లాగా మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ఇక ఆదిపురుష్ మూవీ జూన్ 16న ఇండియా లెవెల్లో ఐదు భాషల్లో రిలీజ్ కానుంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు