Agent: ఇంకా 50 రోజులే.. మరి సాధ్యం అవుతుందా ?

అక్కినేని హీరోలi నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ కు ఈ మధ్య కాలంలో ఏం మాత్రం కలిసి రావడం లేదు. నాగార్జునకు చాలా ఏళ్ల నుంచి బ్లాక్ బస్టర్ హిట్ పడటం లేదు. గతేడాది ప్రారంభంలో “బంగర్రాజు”తో హిట్ కొట్టినా, తర్వాత “ది ఘోస్ట్” సినిమాతో మరోసారి నిరాశపరిచాడు. నాగ చైతన్య కు కూడా సేమ్ అదే పరిస్థితి. ఈ యువ సామ్రాట్ నుంచి ఇటీవల వచ్చిన “థాంక్యూ” “లాల్ సింగ్ చడ్డా” దారుణమైన ఫలితాన్ని ఇచ్చాయి. ఇక అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అఖిల్ కెరీర్ లో ఎంతో కొంత పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మూవీ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ఒకటే. ఇలా అక్కినేని హీరోలు వరుసగా తమ అభిమానులను నిరాశపరుస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ అక్కినేని అభిమానుల హోప్స్ అన్ని కూడా అఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ “ఏజెంట్” పైనే ఉన్నాయి. ఈ మూవీ మరో 50 రోజుల్లో (ఏప్రిల్ 28) విడుదల కాబోతుంది. దీన్నీ అక్కినేని అభిమానులు #AgentStormIn50Days అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అక్కినేని అభిమానులను నిరాశపరిచేలా ఉన్నాయి. “ఏజెంట్” షూటింగ్ ఇంకా పూర్తి కాలేదట. ఇటీవల మస్కట్ లో కీలకమైన షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నారు. ఇంకా రెండు పాటలు షూట్ చేయాల్సి ఉంది. అలాగే కొన్ని ప్యాచ్ వర్క్స్ కూడా బ్యాలెన్స్ ఉన్నాయి. వీటిని ఇప్పుడు పూర్తి చేయాలంటే హీరోగారు.. సెలబ్రెటీ లీగ్ లో బ్యాట్ తో దుమ్ములేపుతున్నాడు. ఈ లీగ్ పూర్తి అయ్యే వరకు ఏజెంట్ సెట్ లో హీరోగారు అడుగుపెట్టడం ఉండకపోవచ్చు. దీంతో ఆ సాంగ్స్, బ్యాలెన్స్ ప్యాచ్ వర్క్ ఎప్పుడు పూర్తి అవుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి.

- Advertisement -

అయితే మొత్తంగా మాత్రం ఏజెంట్ సమ్మర్ లో రావడం దాదాపు కష్టమే అని తెలుస్తోంది. ఇది #AgentStormIn50Days అంటూ ఫుల్ జోష్ లో ఉన్న అక్కినేని అభిమానులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు