Agent: సురేందర్ రెడ్డి మార్క్ లో స్టైలిష్ యాక్షన్ ఏజెంట్ ట్రైలర్..

అక్కినేని అఖిల్ హీరోగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న మూవీ ఏజెంట్.ఏజెంట్ నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ఇంకా పాటలు సినిమా పై అంచనాల్ని పెంచేసాయి. అఖిల్ హీరోగా వస్తున్న ఏజెంట్ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక ముఖ్యపాత్రలో కనిపిస్తున్నారు. ముంబై కి చెందిన బ్యూటీ సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.  ఈమెకిదే  తొలి సినిమా. హిప్-హాప్ తమిజా ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా, ఈ చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, ‘సురేందర్ 2 సినిమా’ బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక తాజాగా అక్కినేని అభిమానులు ఎంతో ఆత్రుత గా ఎదురుచూస్తున్న ఏజెంట్ యొక్క అఫిషియల్ ట్రైలర్ వచ్చేసింది.ఏప్రిల్ 18న కాకినాడ లోని మెక్లారిన్ హై స్కూల్ గ్రౌండ్ లో అభిమానుల సమక్షంలో రాత్రి 8.47 గంటలకి ఈ థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఇక ఏజెంట్ ట్రైలర్ భారీ యాక్షన్, స్టైలిష్ విజువల్స్ తో అదిరిపోయింది. ముఖ్యంగా అఖిల్ స్టైల్, యాక్షన్, వైల్డ్ లుక్స్, ఫైట్స్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పటివరకు ఏజెంట్ ట్రైలర్ యూట్యూబ్ లో 5 మిలియన్ కి పైగా వ్యూస్ తో పాటు 125K లైక్స్ తో దూసుకుపోతుంది.

ఈ ట్రైలర్ లో గమనించిన కొన్ని విషయాలు ఏంటంటే హీరో ఇందులో ఏజెంట్ గా అనగా ఒక గూఢచారి గా కనిపిస్తున్నాడు. విదేశాల్లో ఉన్న ఒక టెర్రరిస్ట్ గ్యాంగ్ ని మట్టు పెట్టేందుకు హీరో స్పెషల్ గా నియమించబడతాడు. ఇక ఈ సినిమాలో మమ్ముట్టి అఖిల్ కు ఒక గురువు లాగా, తన పై ఆఫీసర్ గా నటించాడని తెలిసిపోతుంది. అయితే ట్రైలర్ లో మమ్ముట్టి ఒరిజినల్ వాయిస్ ముందు వినిపించగా, తర్వాత సీన్లో వేరే వాయిస్ ఉంటుంది. ఇక ట్రైలర్ లో హీరోయిన్ సాక్షి ఒక్క షాట్ లో మాత్రమే కనిపిస్తుంది.

- Advertisement -

ఓవరాల్ ఈ ట్రైలర్ ఏజెంట్ మూవీ పై ఉన్న అంచనాలని రెట్టింపు చేసింది. అక్కినేని అఖిల్ కి ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ తప్ప మరో హిట్ లేదు. ఏజెంట్ సినిమా కి మంచి టాక్ వస్తే పెద్ద బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకోవచ్చు. ఈ సినిమా తో అఖిల్ స్టార్ హీరో అవడానికి కూడా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాగా ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో ఏప్రిల్ 28న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు