Teja : దగ్గుబాటి అభిరామ్ “అహింస “సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది.

డైరెక్టర్ తేజ దర్శకత్వంలో దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ ని హీరోగా పరిచయం చేస్తూ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. చాలా రోజుల క్రితమే షూటింగ్ కంప్లిట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పటికి రిలీజ్ కి మాత్రం నోచుకోలేదు. గతంలో ఈ సినిమాకి సంబంధించి టీజర్, ట్రైలర్ రిలీజైన సినిమా విడుదల తేదీని మాత్రం మూవీ యూనిట్ ఎనౌన్స్ చేయలేదు.

అయితే ఇటీవలనే రిలీజైన రామబాణం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గోపిచంద్ ని ఇంటర్వ్యూ చేసిన డైరెక్టర్ తేజ “రిలీజ్ ఎప్పుడు సర్ ” అని గోపీచంద్ అడిగిన ప్రశ్నకి తేజ సమాధానంగా  ” రిలీజ్ ఎప్పుడో నాక్కూడా తెలీదు, సినిమా తీయమన్నారు తీసాను రిలీజ్ అంత ప్రొడ్యూసర్స్ ఇష్టం ” అని చెప్పడంతో తేజ కి ప్రొడ్యూసర్స్ ఏమైనా విభేదాలు ఉండొచ్చు అని అందరు అభిప్రాయపడ్డారు. అయితే ఈరోజు అభిరామ్ పుట్టిన రోజు సందర్బంగా,  అహింస సినిమా ప్రొడ్యూసర్స్ రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేసారు.

అహింస జూన్ 2న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. చాలా రోజుల గ్యాప్ తరువాత ఆర్ పి పట్నాయక్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై కిరణ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. గీతికా తివారి ఈ సినిమాలో అభిరామ్ కి జోడిగా నటిస్తుంది. ఇంటెన్స్ లవ్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్లు, ట్రైలర్  జయం, నిజం సినిమాలని తలపిస్తున్నాయి. హీరోయిన్ సదా, కమల్ కామరాజు ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. జూన్ 2న థియేటర్స్ కి రాబోతున్న ఈ సినిమా  ప్రేక్షకులని ఎంతవరకు అలరిస్తుందో చూడాలి. . అయితే ఏ సినిమా చేయకుండానే రకరకాల వివాదాలలో చిక్కుకున్న అభిరామ్ ఈ సినిమాతోనైన దారికొస్తాడో లేదో చూడాలి. ఈ సినిమాని కి సంబందించిన డిస్టిబ్యూషన్ రైట్స్ సురేష్ ప్రొడక్షన్ తీసుకుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు