Agent: అఖిల్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అప్పుడే గర్భవతి కూడా అయిందా !

సాధారణంగా సినీ పరిశ్రమలలో యాక్టర్స్ డేటింగ్స్ చేయడం, రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకోవడం, పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోవటం లాంటివి రోజు వింటూనే ఉంటాం. అయితే ఈ రకమైన జాబితాలో సీనియర్ హీరోల నుంచి మొదలు పెడితే యంగ్ హీరోల వరకు లిస్ట్ చాలానే ఉంది.

ఇక విషయానికొస్తే గతంలో అఖిల్ అక్కినేనికి ఎంగేజ్మెంట్ అయిన విషయం అందరికి తెలిసిందే. శ్రియ భూపాల్ అనే ఫ్యాషన్ డిజైనర్ కి మరియు అఖిల్ కి మధ్య చాలా రోజులు ప్రేమ వ్యవహారం నడిచిన విషయం అందరికి తెలిసిందే. ఆ తరువాత వీరిద్దరూ రెండేళ్లపాటు డేటింగ్ కూడా చేసారు. అయితే ఈ వ్యవహారమంతా ఇద్దరి ఇళ్లలోను తెలియడంతో పెళ్లికి ఏర్పాట్లు చేసారు. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఈ జంట పెళ్లికి కూడా రెడీ అయ్యారు. డిసెంబర్9, 2016లో వీళ్ళకి ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఎంతైనా అఖిల్ నాగార్జునకి ముద్దుల కొడుకవ్వడంతో పెళ్లిని ఇటలీలో ఘనంగా చేయడానికి ఏర్పాట్లు చేసారు. అంత సవ్యంగా జరుగుతున్న సమయంలో ఈ యంగ్ కపుల్ ఎదో విషయంలో గొడవపడి నిశ్చితార్థం, పెళ్లి రెండు క్యాన్సిల్ చేసుకున్నారు.

ఆ తరువాత ఇద్దరు విడిపోయి..ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. దాంతో అఖిల్ మళ్ళీ పెళ్లి, ప్రేమ జోలికి వెళ్లకుండా సినిమాలపై ఫోకస్ పెట్టాడు. అయితే అఖిల్ ఎక్స్ లవర్ శ్రియ భూపాల్ మాత్రం అఖిల్ తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వగానే వెంటనే అనిందిత్ రెడ్డి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అంతేకాదు ఇప్పుడు ఆమె గర్భవతి కూడా. అయితే శ్రియ భూపాల్ ఫ్యామిలీకి మహేష్ బాబు కుటుంబానికి దగ్గరి సంబంధాలు ఉండటంతో ఇటీవలనే శ్రియ భూపాల్ బేబీ షవర్ ఫంక్షన్ కి మహేష్ ఫ్యామిలితో సహా అటెండ్ అయ్యారు. దాంతో ఈ న్యూస్ మళ్ళీ వెలుగులోకి వచ్చింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు