OG: హైప్ ఎక్కించడం గాదు? ఏకంగా పిచ్చెక్కిస్తున్నాడు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్ లో అందరికంటే ఎక్కువగా నాలుగు సినిమాలతో బిజీ గా ఉన్నాడు. అటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే వీలైనప్పుడల్లా సినిమాలు పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే ఒక చిత్ర షూటింగ్ పూర్తవగా, మరో సినిమా తుది దశకు చేరుకుంది. అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ నాలుగు సినిమాల్లో అభిమానులు ఎక్కువగా ఎదురు చూస్తుంది మాత్రం ఒక్క “ఓజి” కోసం మాత్రమే. సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో ప్రొడ్యూసర్ దానయ్య నిర్మిస్తున్నాడు.

పవర్ స్టార్ ని ఎలా చూడాలని అనుకుంటున్నారో అంతకు మించి చూపిస్తానని సుజీత్ ఒక సందర్భంలో చెప్పాడు. దానికి తగ్గట్టుగానే సినిమా నుండి వచ్చే ఒక్కో అప్డేట్ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే కొంతభాగం పూర్తయిపోయిన ఈ సినిమా షూటింగ్ రెగ్యులర్ షూట్ మళ్ళీ జులై లో మొదలవ్వనుంది. ఇక రీసెంట్ గా జరిగిన ఈ సినిమాలో పాత్రల ఎంపిక కూడా క్రేజీ గా ఉంది. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ, కోలీవుడ్ విలక్షణ నటుడు అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి వీళ్ళందరూ సినిమాలో ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.

తాజాగా ఓజి గురించి వెర్సటైల్ యాక్టర్ అర్జున్ దాస్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఓజి గురించి ట్విట్టర్ లో పోస్ట్ చేసిన అర్జున్ ఇలా అన్నాడు. సుజీత్ సార్ తనకు నిన్న “ఓజి” నుండి కొన్ని విజువల్స్ చూపించారు. అవి చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను. థ్రిల్ ఫీలయ్యాను. ఆ వీడియోలో విజువల్స్ గాని, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, స్వాగ్ & డైలాగ్స్ అన్ని అదిరిపోయాయి అన్నాడు. ఫైనల్ గా తాను చెప్పేది ఒక్కటే – పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ గెట్ రెడీ అసెంబుల్, “ది పవర్ స్ట్రోమ్ ఈజ్ కింగ్” అంటూ ట్వీట్ వేసాడు.

- Advertisement -

చివర్లో “సంభవం ఈజ్ కమింగ్ యువర్ వే” అంటూ ట్వీట్ లో ఉంది. ఈ మాటకి పవన్ ఫ్యాన్స్ ఏదేదో ఊహించుకుంటున్నారు. ఈ ట్వీట్ చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమాపై విపరీతంగా హైప్ ఎక్కించుకుంటున్నారు. కొంతమంది డై హార్డ్ ఫ్యాన్స్ ట్వీట్ కే పెచ్చెక్కిపోయి సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెంచేస్తున్నారు. అటు ట్రేడ్ వర్గాలు కూడా సుజీత్ మరీ ఆ రేంజ్ లో సినిమా తీస్తున్నాడా? అంటూ షాక్ అవుతున్నారు. కానీ ఈ సినిమా రిలీజ్ కావాలంటే ఇంకో సంవత్సరం దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. మరి అప్పటివరకు ఓజికి సంబంధించిన అప్డేట్ లతోనే ఫ్యాన్స్ గడపాలి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు