Akhanda2 : చిరంజీవి డైరెక్టర్ తో బాలకృష్ణ నెక్స్ట్ సినిమా !

నందమూరి బాలకృష్ణ ఈ మధ్య సీనియర్ డైరెక్టర్ లని పక్కన పెట్టి యంగ్ డైరెక్టర్ లతో కలిసి పని చేయడానికి ఆసక్తి చుపిస్తునట్టు తెల్సుతోంది. ఇప్పటికే యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న బాలయ్య, ఆయన తరువాత సినిమాకిగాను మరో యంగ్ డైరెక్టర్ తో కలిసి పని చేయబోతున్నాడు.

అఖండ, వీరసింహరెడ్డి సినిమాలతో హిట్ ట్రాక్ లో ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం షైన్ స్క్రీన్ బ్యానర్ పై, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. వీరసింహరెడ్డి సినిమాలో రాయసీమ యాసలో, ఫ్యాక్షనిస్ట్ పాత్రలో ప్రేక్షకులని అలరించిన బాలకృష్ణ, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో తెలంగాణ భాష, యాసతో కార్మికుల కష్టాల కోసం పోరాడే భగవత్ కేసరి పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించి టీజర్, టైటిల్ ఎనౌన్స్ మెంట్ బాలకృష్ణ పుట్టిన రోజు సందర్బంగా జూన్ 10న రిలీజ్ చేయబోతున్నారు.ఈ సినిమాలో బాలకృష్ణ కి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, యంగ్ హీరోయిన్ శ్రీలీల ప్రముఖ పాత్రలో నటిస్తుంది.

అయితే అనిల్ రావిపూడి సినిమా తరువాత బాలయ్య, బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ2 సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా రాబోయే ఆంధ్ర ప్రదేశ్ఎలక్షన్స్ బేస్ చేసుకొని ఉండబోతుంది. ఈ సినిమా తరవాత బాలకృష్ణ డైరెక్టర్ బాబీ కొల్లితో సినిమా చేయబోతున్నడని సమాచారం. ఇటీవలనే చిరంజీవి హీరోగా నటించిన వాల్తేర్ వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాబీ, ఆయన తరువాత సినిమాకి గాను బాలకృష్ణతో చేయబోతున్నరని టాక్ . ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశి నిర్మించనున్నరట. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమాపై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది. అయితే బాబీ ఈ కథని రజని కాంత్ కోసం రాసుకోగా, ఆయనతో చేయడం కుదరక బాలకృష్ణ తో చేస్తున్నాడని సమాచారం.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు