Indian Cinema: రూటు మార్చిన బాలీవుడ్ – ఇప్పటికైనా తప్పు దిద్దుకుంటుందా..?

బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయి అన్నట్టుంది బాలీవుడ్ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అన్నట్టు వ్యవహరించేవారు అక్కడి జనాలు మరియు ఇండస్ట్రీ వారు. తెలుగు సినిమా అంటే చిన్న చూపు చూసేవారు. ఈ వివక్ష కేవలం సినిమాల్లోనే కాకుండా ప్రతి రంగంలోనూ ఉంది. ఇతర రంగాల గురించి ప్రస్తావన అప్రస్తుతం, సినిమా రంగం విషయానికి వస్తే తామే నంబర్ అన్న అహంతో విర్రవీగిన బాలీవుడ్ స్టార్స్ కు ఇప్పుడు తత్త్వం బోధపడినట్లు ఉంది. అప్పట్లో మనకు కథలు అరువు ఇచ్చిన బాలీవుడ్ మన నేటివిటీ ఉన్న కథల కోసం వెంపర్లాడుతోంది.

యూట్యూబ్ లో హిందీలోకి డబ్ అయిన మన సినిమాలకు డిమాండ్ పెరగడానికి కారణం మూస ధోరణిలో వస్తున్న బాలీవుడ్ సినిమాలే కారణం. బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదు ఇటీవల వచ్చిన పఠాన్, బ్రహ్మాస్త్ర మినహాయిస్తే. బాలీవుడ్ కథల్లో అనవసరపు హంగు ఆర్భాటాలు తప్పించి, కొత్తదనం లేకపోవటం, రియాలిటీకి దూరంగా ఉండటంతో అక్కడి ఆడియెన్స్ వాళ్ళ సినిమాలను తిరస్కరించటం మొదలెట్టారు. అదే సమయంలో ఓటీటీ కల్చర్ పెరగటం, భాషతో సంబంధం లేకుండా ఇంట్లో ఉండి నచ్చిన సినిమాలు నచ్చిన సమయంలో చూసుకునే వెసలుబాటు ఉండటంతో నార్త్ ఆడియెన్స్ మన సినిమాలకు అలవాటు పడ్డారు.

ప్రేక్షకుల తిరస్కారానికి గురైన బాలీవుడ్ చేసేదేమీ లేక ఇప్పుడు సౌత్ ఫ్లేవర్ ఉన్న కథలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా సల్మాన్ హీరోగా వస్తున్న కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమానే  ఇందుకు నిదర్శనం. సినిమాలో వెంకటేష్ కు ఒక ఇంపార్టెంట్ రోల్ ఇవ్వటమే కాకుండా మన తెలంగాణ నేటివిటీ అయిన బతుకమ్మ మీద ఒక సాంగ్ కూడా చేసారు ఈ సినిమాలో. అంతే కాకుండా రామ్ చరణ్ స్పెషల్ రోల్ లో సల్మాన్ ఖాన్ వెంకీలతో పాటు పంచ కట్టులో కనిపించటం కొసమెరుపు. కళకు భాష, ప్రాంతం అన్న ఎల్లలు లేనప్పటికీ, ఒకప్పుడు తెలుగు సినీరంగాన్ని కనీసం గుర్తించకుండా చిన్న చూపు చుసిన ఉత్తరాది వారు ఇప్పుడు మన కథల కోసం క్యూ కట్టడం ఒక రకంగా మంచి పరిణామమే అని చెప్పాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు