Dasara : కీర్తి సురేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్

ప్రస్తుతం సౌత్ ఫిలిం ఇండస్ట్రీలలో అత్యంత బిజీ గా ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది కీర్తి సురేష్ మాత్రమే అని చెప్పవచ్చు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తూ సినీ ప్రేక్షకులని అలరిస్తుంది ఈ వెన్నల. ఐతే ఇటీవలనే కీర్తి సురేష్ సినిమాలతోనే కాకుండా పలు రూమర్స్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

గత కొద్దిరోజుల క్రితం ఆమె ఒకబ్బాయితో కొంచెం క్లోజ్ గా ఫోటో దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా..అవి బాగా వైరలై, కీర్తి సురేష్ లవ్ లో పడిందంటూ.. డేటింగ్ చేస్తుందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ రూమర్స్ ఎంత పాపులర్ అయ్యాయంటే చివరకి కీర్తి ఫాదర్ సురేష్ కూడా మీడియా ముందుకి వచ్చి తన కూతురు పెళ్లి గురించి, ప్రేమ గురించి వచ్చే వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చెప్పేవరకు వెళ్లాయి. అయితే కీర్తి కూడా ఈ విషయంపై స్పందించి, పెళ్లి గురించిన ఆలోచనలు ఏవి లేవు అని చెప్పడంతో, కీర్తి సురేష్ పెళ్లి వార్తలు ఆగిపోయాయి.

అయితే లేటెస్ట్ గా కీర్తి సురేష్ పై ఒక బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్ లో వైరలవుతున్నాయి . విషయమేంటంటే ఆమె ఇటీవలనే తమిళ్ లో ఉదయనిధి స్టాలిన్ హీరోగా మామన్నన్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాకి సంబంధించి ఆడియో లంచ్ ఇటివలనే చెన్నై లో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్బంగా ఈ ఈవెంట్ లో పాల్గొన్న ప్రముఖ ప్రొడ్యూసర్ బోణి కపూర్ కీర్తి సురేష్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

- Advertisement -

కీర్తి సురేష్ ని చూస్తే ఆయనకి తన భార్య అయిన శ్రీదేవినే గుర్తొస్తుందని తన యాక్టింగ్, లుక్స్ శ్రీదేవికి చాలా దగ్గరగా ఉంటాయని అని అభిప్రాయ పడ్డారు.అయితే శ్రీదేవితో ఆయన కీర్తి సురేష్ ని పోల్చడంతో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.కీర్తి కూడా ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ మామన్నన్ సినిమా తప్పకుండ అందరికి నచ్చుతుందని, చెబుతూ.. బోణి కపూర్ కి తనని శ్రీదేవి తో పోల్చినందుకు థాంక్స్ చెప్పింది. ఈ సినిమాకి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించగా, వెట్రిమారన్ శిష్యుడు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు