Mallemala : ఢీ షో పేరు ఇస్తుంది కానీ.. డబ్బులు ఇవ్వదు అందుకే చనిపోతున్న

ఈటీవీ ప్రసారమయ్యే ఢీ, జబర్దస్త్ లాంటి షోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది డాన్సర్స్ , కమెడియన్స్ ఈ షోల ద్వారానే జీవనం సాగిస్తున్నారు. ప్రత్యేక్షంగా ,పరోక్షంగా ఎంతో మందికి ఈ షోలు అవకాశాల పరంగా , సంపాదన పరంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి.

అయితే ఢీ షో లో కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్న చైతన్య,  ఆ షోలో యాజమాన్యం ఇచ్చే డబ్బులు ఏమాత్రం సరిపోక, అప్పులు చేసి, అలా చేసిన అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేసి ఇక ఆ అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య కి చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు చైతన్య ఒక సెల్ఫీ వీడియో తీసుకొని తన తోటి డాన్సర్స్ కి, అమ్మ నాన్నలకి క్షమాపణ చెబుతూ ఢీ షో వల్ల తనకి నేమ్, ఫేమ్ వచ్చాయి తప్ప సంపాదన మాత్రం ఆశించినంత లేదని, అందరిలా ఇళ్లు ,కార్లు కొనలేకపోయాను  పైగా అప్పులలో కురుకుపోయానని తీర్చే స్తోమత లేక చనిపోతున్న అని సెల్ఫీ వీడియోలో చైతన్య తెలియపరచాడు.

ఏప్రిల్ 29 ప్రపంచ నృత్య దినోత్సవం సందర్బంగా ఒక నృత్య ప్రదర్శన కార్యమానికి హాజరైన చైతన్య ఆ తరువాత అప్పుల ఆలోచనలతో మనస్తాపానికి గురయ్యాడు. నెల్లూరులోని క్లబ్ హోటల్ సెల్ఫీ వీడియో ద్వారా తన బాధని వ్యక్తీకరించి ఇదే నా లాస్ట్ వీడియో అని ఉరి వేసుకొని చనిపోయాడు. పోలీసులు హోటల్ చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చైతన్య బాడీ ని ఆయన స్వస్థలం నెల్లూరు లోని ఉత్తమవారి పాలెంకి తరలించారు. చైతన్య మరణ వార్త విన్న తోటి డాన్సర్స్ తమకు సమస్య ఇది అని చెప్తే మేము మాట్లాడేవాళ్ళం ఇలా ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో అంటూ తమ బాధని వ్యక్త పరుస్తున్నారు. మరి ఈ విషయమై ఢీ షో యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు