Tollywood : ఇంటర్నేషనల్ అవార్డు ని గెలుచుకున్న టాలీవుడ్ నటుడు

జె.డి. చక్రవర్తి. వైవిధ్యమైన నటుడుగా తెలుగులో మంచి పేరున్న నటుడు. ఒకప్పుడు టాలీవుడ్ లో ఒకప్పుడు రవితేజ, శ్రీకాంత్ లాంటి నటులతో సమంగా నిలిచిన హీరో. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ సినిమా తో పరిచయమై గులాబీ, ప్రేమకు వేళాయెరా, కోదండ రాముడు, అనగనగా ఒకరోజు, సత్య లాంటి సినిమాల్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎక్కువగా రామ్ గోపాల్ వర్మ సినిమాల్లోనే కనిపించే ఈ నటుడు ఆ మధ్య దర్శకుడిగా కూడా మారి కొన్ని సినిమాలు తీశాడు. ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయకున్నా ఆర్జీవీ సినిమాల్లో కొన్ని హిందీ సినిమాల్లో చేస్తున్నాడు.

తాజాగా జె.డి చక్రవర్తి తాను ప్రధాన పాత్రలో నటించిన ఒక సినిమాకి ఇంటర్నేషనల్ అవార్డు ని అందుకున్నాడు. హిందీలో 2022 లో వచ్చిన “దహిని ది విచ్” అనే సినిమాలో జె.డి చక్రవర్తి ముఖ్య పాత్రలో నటించారు. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంది. ఇప్పుడు “ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్” లో ‘దహిని ది విచ్’ సినిమా కు గాను “బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్”గా జె.డి చక్రవర్తి అవార్డు ని అందుకున్నారు.

దహిని ది విచ్ సినిమాను ఎం.స్.రాజేష్ అనే మలయాళీ డైరెక్టర్ తెరకెక్కించారు. ఇంతకు ముందు ఈయన తీసిన నా బంగారు తల్లి చిత్రానికి కూడా ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులు వచ్చాయి. దహిని ది విచ్ సినిమాను హిందీ, ఒడియా భాషల్లో తెరకెక్కించారు. హర్రర్ థ్రిల్లర్ గా రియలిస్టిక్ గా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు