Chiranjeevi: యూఎస్ లో వీరయ్య అరాచకం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బాబీ దర్శకత్వంలో తాజాగా వచ్చిన చిత్రం వాల్తేరు వీరయ్య. దీనిలో చిరంజీవికి జోడీగా శ్రుతి హాసన్ నటించిన విషయం తెలిసిందే. అలాగే మాస్ మహారాజా రవితేజ, కేథరిన్ ట్రెసా కీలక పాత్రల్లో కనిపించారు. కాగా సంక్రాంతి కానుగా ఈ నెల 13న విడుదలైన వాల్తేరు వీరయ్య మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకుంది. కలెక్షన్లు కూడా భారీ స్థాయిలో వస్తున్నాయి.

సంక్రాంతి బరిలో నిలిచిన తెలుగు సినిమాల్లో ఎక్కువ కలెక్షన్లు వాల్తేరు వీరయ్యకే వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్ల గ్రాస్ ను వసూళ్లు చేసింది. ఈ వారం ముగిసే సమయానికి కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్ లోనూ మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా అమెరికాలో వాల్తేరు వీరయ్య కలెక్షన్ల పరంగా రికార్డులను నమోదు చేస్తుంది. తాజాగా ఈ చిత్రం యూఎస్ లో 2 మిలయన్ డాలర్ల మార్క్ ను అందుకుంది.

- Advertisement -

కాగా మెగాస్టార్ కమ్ బ్యాక్ తర్వాత 5 సినిమాలు చేసారు. అయితే ఆ 5 సినిమాలు యూఎస్ లో మంచి కలెక్షన్స్ సాధించటం విశేషం. ఈ 5 సినిమాలలో యూఎస్ లో 2 మిలియన్ మార్క్ ను అందుకోవడం ఇది మూడో సారి. మొదటగా ఖైదీ నెంబర్ 150 చిత్రం 2.44 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. తర్వాత సైర నరసింహారెడ్డి 2.60 M కు చేరింది. ఇది మెగాస్టార్ కెరీర్ లోనే అత్యధికం. తాజాగా వాల్తేరు వీరయ్య 2.0 M మార్క్ ను అందుకోగా, గతం లో గాడీఫాథర్ , ఆచార్య 1 మిలియన్ మార్క్ ను అందుకున్నాయి.

వాల్తేరు వీరయ్య కు ఇంకా ఆదరణ తగ్గలేదు. కాబ్టటి, ఇది సైర నరసింహారెడ్డి రికార్డును చెరిపేసే అవకాశం కూడా ఉంది.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు