మెగాస్టార్ చిరంజీవి.. దశబ్ధాల పాటు తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ.. మెగాస్టార్ అనే ట్యాగ్ ను సంపూర్ణం చేస్తూ వస్తున్నాడు. అయితే, గత కొన్ని రోజుల నుంచి మెగా ఫ్యాన్స్ కు ఓ తీరని లోటు ఉంది. అదే.. వింటేజ్ మెగాస్టార్ ను చూడాలని. కమ్ బ్యాక్ తర్వాత వచ్చిన ఖైదీ నెంబర్ 150లో చిరంజీవి లుక్స్, స్టైల్ కొంత వరకు ఆ లోటును తీర్చినా.. సరిపోలేదు. ఓ ముఠామేస్త్రీ, ఓ గ్యాంగ్ లీడర్ వంటి సినిమాల్లో కనిపించిన చిరంజీవి కోసం మెగా ఫ్యాన్స్ ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. సరిగ్గా అలాంటి సినిమానే వాల్తేరు వీరయ్య అంటూ డైరెక్టర్ బాబీ.. సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి చెబుతున్నారు. అంతే కాదు, ఓ ఫ్యాన్ బాయ్ గా.. మెగాస్టార్ ను ఎలా చూడాలి అనుకుంటున్నానో.. అలాగే ఈ సినిమాను చేస్తున్నానని ప్రకటించి సినిమాపై భారీగా అంచనాలు పెంచాడు. అలాంటి వాల్తేరు వీరయ్య సంక్రాంతి కానుకగా నేడు రిలీజ్ అయింది. మరీ ఈ మూవీ ఎలా ఉందో.. ఇప్పుడు చూద్దాం..
కథ :
విశాఖపట్నంలోని చిన్న వాల్తేరు అనే గ్రామంలో వాల్తేరు వీరయ్య (చిరంజీవి) ఉంటాడు. సముద్రంపై, చుట్టుపక్క గ్రామాలపై పట్టు ఉన్న వీరయ్య.. కొన్ని సార్లు నేవీ అధికారులకు కూడా సాయం చేస్తూంటాడు. అయితే అదే ప్రాంతంలో మారేడుమల్లిలో సీతాపతి (రాజేంద్ర ప్రసాద్) సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా ఉంటాడు. మలేషియా నుంచి డ్రగ్ మాఫియాను రన్ చేస్తున్న సాల్మన్ సీజర్ (బాబీ సింహా) వల్ల సీతాపతి స్టేషన్ లో పోలీసులు చనిపోతారు. అలాగే సీతాపతి సస్పెండ్ అవుతాడు. దీనికి కారణమైన సాల్మన్ సీజర్ ను చట్టానికి పట్టించాలని సీతాపతి ప్రయత్నిస్తాడు. అప్పుడు వీరయ్య గురించి తెలుస్తోంది. సాల్మన్ ను పట్టుకోవడం వీరయ్య వల్లే సాధ్యం అవుతుందని గ్రహిస్తాడు. దీని కోసం వీరయ్యతో 25 లక్షలతో ఓ ఒప్పందం చేసుకుంటాడు. అందుకోసం మలేషియా వెళ్లిన వీరయ్య.. సాల్మన్ ను పట్టుకున్నాడా ? వీరయ్య కు మైఖేల్ సీజర్ అలియస్ కాలా (ప్రకాశ్ రాజ్) ఎలా టార్గెట్ అయ్యాడు ?. దీనికి అతిథి (శ్రుతి హాసన్) ఎలా సాయం చేసింది ? ఎంతో నిజాయితీగా పని చేసే ఏసీపీ విక్రమ్ సాగర్ (రవితేజ)కు వీరయ్యకు మధ్య సంబంధం ఏమిటీ ? అనేది తెలియాలంటే పూర్తి సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నుంచి ఎన్ని సినిమాలు వచ్చినా.. వింటేజ్ చిరును చూడాలని మెగా ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ మార్క్ డ్యాన్స్, కామెడీ టైమింగ్, బాడీ లాగ్వేంజ్ ను మళ్లీ చూడాలనే ఫ్యాన్స్ కోరిక ను తీరుస్తానని డైరెక్టర్ బాబీ ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడే చెప్పాడు. ఒక ఫ్యాన్ గా మెగాస్టార్ ను సిల్వర్ స్క్రీన్ పై ఎలా చూస్తే ఫ్యాన్స్ లో పూనకాలు వస్తాయో తనకు తెలుసు అని, అలానే వాల్తేరు వీరయ్యలో చిరును చూపించబోతున్నానని ప్రతి వేదికపైనే చెప్పాడు. ఈ మాటలను వందకు వంద శాతం నిజం చేశాడు డైరెక్టర్ బాబీ. సినిమాలో మెగాస్టార్ వేసిన డ్యాన్స్, కామెడీ టైమింగ్ కు ఫ్యాన్స్ నుంచి ఒకటే.. అరుపులు.. ఈలలు గోలలు. లుక్ నుంచి మొదలు పెడితే.. ప్రతి అంశం మెగా ఫ్యాన్స్ కు మెగా ట్రీట్ ఇచ్చే విధంగానే ఉంది.
మధ్య మధ్యలో ముఠామేస్త్రీ, గ్యాంగ్ లీడర్ రిఫరెన్స్ లను చూపించి.. సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. డ్యాన్స్, కామెడీ, ఫైట్స్ సీన్స్ తో చిరంజీవిని పాత మెగాస్టార్ గా చూపించాలి అనే లక్ష్యంతోనే బాబీ ఈ సినిమా చేశాడని తెలుస్తోంది. చిరు వాడిన స్లాంగ్, కాస్టూమ్స్ అన్ని కూడా సినిమాపై మార్కులను పెంచేలానే చూసుకున్నాడు. ఇంటర్వెల్ సీన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. దాదాపు 10 నుంచి 15 నిమిషాలు ఉండే ఈ సీన్.. ఫ్యాన్స్ కు గూస్ బామ్స్ తెప్పిస్తోంది. సెంకడాఫ్ పై ఇంట్రెస్ట్ పెంచేలా చేస్తోంది. దీన్ని రిఫ్లేక్ట్ చేసేలా.. ఇంటర్వెల్ లో పూనకాలు లోడింగ్ అనే కార్డ్ వేయడంతో సినిమాపై బాబీకి ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది.
ఫస్టాఫ్ లో చిరు పాత్ర పరిచయం, వింటేజ్ మెగాస్టార్ ను చూపించడానికే తీసుకున్నాడు. అసలు కథను సెకండాఫ్ లో చూపించాడు డైరెక్టర్. నిజానికి వాల్తేరు వీరయ్య స్టోరీ పాతదే. కానీ డైరెక్టర్ బాబీ చూపించిన విధానం మాత్రం కొత్తది. తమ్ముడి గౌరవమర్యాదలను కాపాడుకోవడానికి అన్న చేసే పోరాటమే వాల్తేరు వీరయ్య. ఈ లైన్ పై స్టోరీ చేసి ప్రేక్షకులకు బోరు ఫీల్ రాకుండా.. చాలా జాగ్రత్తగా తెరకెక్కించాడు బాబి. ఇంటర్వెల్ సీన్ తో సెకండాఫ్ పై భారీ అంచనాలను తీసుకువస్తాడు. సెకండాఫ్ ను కూడా బాగానే స్టార్ట్ చేశాడు. కానీ, క్రమంగా అనవసరపు సీన్లు రావడంతో.. కొంత ల్యాగ్ ఫీలింగ్ వస్తుంది. సినిమా ఆసక్తికరంగా సాగుతున్న సమయంలో నీకెమో.. అందమేక్కువా.. నాకెమో.. తొందర ఎక్కువ అనే పాట ప్రేక్షకుడి ఆసక్తిగా అడ్డుకట్టు వేసినట్టు అనిపిస్తుంది.
రవితేజ ఎంట్రీ తర్వాత మళ్లీ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. రవితేజ, చిరంజీవి మధ్య వచ్చే కామెడీ, ఎమోషనల్ సీన్స్ తో పాటు పూనకాలు లోడింగ్ అనే సాంగ్ మెప్పిస్తుంది. ఈ పాటతో పాటు సినిమాలో వచ్చే ప్రతి సాంగ్ కు ప్రేక్షకుల నుంచి విజిల్స్ వస్తాయి. అయితే వీరసింహా రెడ్డిలా ఈ సినిమాలో కూడా శ్రుతి హాసన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. సినిమాకు మంచి టాక్ వచ్చినా.. అది ఆమెకు పెద్దగా ఉపయోగపడదు. ఇక క్లైమాక్స్ ను భారీగా ప్లాన్ చేసి కూల్ గా ఎండ్ చేశాడు. చివర్లో కోర్ట్ సీన్ లో చిరంజీవి చేసింది కొంత వరకు అతి అనిపించినా.. సెంటిమెంట్ తో కరెక్ట్ చేసుకున్నాడు.
నటీనటుల విషయానికి వస్తే.. వింటేజ్ చిరంజీవి అన్ని కోణాల్లో ఇరగదీశాడు. రవితేజ నుంచి ఫ్యాన్స్ మంచి ఫర్మామెన్స్ ను అంచనా వేశారు. దాన్ని అందుకున్నాడు. బాబీ సింహా, ప్రకాశ్ రాజ్ మరోసారి విలన్ గా మెప్పించారు. కానీ, ప్రకాశ్ రాజ్ ను అత్యంత భయంకరంగా చూపించి.. క్లామాక్స్ లో మరీ సిల్లిగా చూపించారు. క్లైమాక్స్ లో ప్రకాశ్ రాజ్ పాత్రను వేరే కోణంలో చూపించాల్సింది. ఇక హీరోయిన్స్ శ్రుతి హాసన్, కేథరిన్ ట్రెసా.. వీరి పాత్రలకు పెద్దగా స్కోప్ లేదు. అయితే వీరు ఉన్న దానికి న్యాయం చేశారు.
దేవీ శ్రీ ప్రసాద్ చాలా రోజుల తర్వాత సూపర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. చిరుకు ఎలివేషన్ సీన్ వచ్చిన ప్రతిసారి వచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఈ చిత్రంలోని సాంగ్స్ రిలీజ్ సమయంలో దేవీ శ్రీ ప్రసాద్ పై పలు రకాలుగా ట్రోల్స్ వచ్చాయి. కానీ థియేటర్ కి వచ్చే సరికే ఆ సాంగ్సే ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించాయి. సినిమాటోగ్రఫి బాగుంది. కొన్ని యాంగిల్స్ లో చిరు చూడముచ్చటగా ఉన్నాడు. ఎడిటింగ్ విషయానికి వస్తే.. సెకండాఫ్ ను మరి కొంత ట్రిమ్ చేస్తే.. అవుట్ పుట్ మరింత బాగుండేది.
ఫ్లస్ పాయింట్స్ :
మైనస్ పాయింట్స్ :
మొత్తంగా..
వీరయ్య.. ఉతికి ఆరేశాడయ్యా..