Ram Charan: బర్త్ డే సీడీపీపై ఎందుకంత రచ్చ ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు ఈ నెల 27న జరపుకుంటున్న విషయం తెలిసిందే. దీనికి మెగా అభిమానులు ఇప్పటి నుంచే ఏర్పాట్లు స్టార్ట్ చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చరణ్ పుట్టిన రోజు ఈ సారి గ్రాండ్ గా చేయాలని ప్లాన్స్ వేస్తున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ బర్త్ డే సీడీపీ (కామన్ డిసిప్లే పిక్చర్) ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సీడీపీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.

ఈ సీడీపీ.. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అన్నట్టు చూపిస్తుంది. రామ్ చరణ్ టేబుల్ పై స్టైల్ గా కూర్చున్నాడు. వెనకాల వరల్డ్ మ్యాప్ ఉంది. చరణ్ పక్కన ఆర్ఆర్ఆర్ మూవీకి వచ్చిన ప్రఖ్యాత ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఉన్నాయి. అలాగే వెనకాల చరణ్ తన కెరీర్ లో సాధించిన అవార్డ్స్ కూడా ఉన్నాయి. అలాగే కింద ఈ గ్లోబల్ స్టార్ సినిమాలకు వచ్చిన ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ తో పాటు నందిలు కూడా ఉన్నాయి.

వీటితో పాటు చరణ్ ఘనతను చాటి చెప్పిన స్వదేశి, విదేశి పేపర్ క్లిప్పింగ్స్ కూడా సీడీపీలో కవర్ చేశారు. అలాగే చరణ్ నిర్మాతగా ఉన్న కొణిదెల బ్యానర్ లోగోను కూడా ఈ సీడీపీలో ఉంచారు. మొత్తంగా రామ్ చరణ్ తన కెరీర్ లో సాధించిన వాటి అన్నింటినీ దీనిలో ఉండేలా చూసుకున్నారు. ముఖ్యంగా ఈ సీడీపీతో రామ్ చరణ్.. మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు అన్నట్టు చూపించారు.

- Advertisement -

అయితే ఈ సీడీపీపై కొంత వ్యతిరేకత వస్తుంది. ఫిల్మ్ ఫేర్, నంది అవార్డ్ లను చరణ్ కాళ్ల దగ్గర ఉంచారని, చరణ్ కు రాకపోయినా ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ లను పక్కన పెట్టుకున్నాడని విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే చరణ్, మెగా ఫ్యాన్స్ ధీటుగా సమాధానం ఇస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఇది ట్రెండింగ్ లో ఉంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు