Custody : ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేదంటూ నాగచైతన్య ఓపెన్..

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు అక్కినేని నాగచైతన్య. జోష్ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఇక సమంతతో విడాకులు తీసుకున్న అనంతరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. థాంక్యూ మూవీ తర్వాత నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “కష్టడీ”. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో నాగచైతన్య పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.

ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రం మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది. దీంతో కస్టడీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు నాగచైతన్య. అయితే తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మీ జీవితంలో పశ్చాత్తాపడ్డ సంఘటనలు, విచారకరమైనవి ఏమైనా ఉన్నాయా..? అని అడగగా.. అలాంటివేవి లేవని సమాధానం చెప్పారు. తనకి ఎదురైన ప్రతి సంఘటన నుంచి ఒక పాఠం నేర్చుకున్నానని తెలిపారు. అయితే కొన్ని సినిమాల విషయాలలో చాలా బాధపడ్డాను కానీ.. వాటి మీద సరైన నిర్ణయం తీసుకోలేకపోయాననే బాధ ఉంటుందన్నారు. ఆ ఒక్క విషయంలో బాధ అనిపిస్తూ ఉంటుందని.. తన కెరీర్ లోని మూడు సినిమాల విషయంలో ఇలా జరిగిందని స్పష్టం చేశారు నాగచైతన్య. ఇక ప్రస్తుతం నాగచైతన్య తన ఆశలన్నీ కస్టడీ పైనే పెట్టుకున్నారు. మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకి కస్టడీతో వస్తున్న నాగ చైతన్య ఏ మేరకు ఆకట్టుకుంటాడో వేచి చూడాలి.

For More Updates :

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు