Naga Chaithanya : ఓటిటిలోకి వచ్చేస్తున్న కస్టడీ సినిమా !

నాగ చైతన్య హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా కస్టడీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవడానికి రెడీ అయింది. తమిళ్, తెలుగు బైలాంగ్వేజికల్ సినిమాగా తెరకెక్కిన ఈ కస్టడీ సినిమాకి తమిళ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. నాగ చైతన్యకి జోడిగా ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.

ఇటీవలనే అఖిల్ హీరోగా భారీ బడ్జెట్ తో, భారీ అంచనాల మధ్య రిలీజైన ఏజెంట్ సినిమా అటు అక్కినేని అభిమానులను, ఇటు సినీ ప్రేక్షకులని తీవ్రంగా నిరాశపరిచింది. దాంతో అభిమానులంతా నాగ చైతన్య కస్టడీ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. దానికి తోడు ఈ సినిమాపై కూడా మొదటి నుంచి మంచి బజ్ క్రియేట్ అయింది. అలాగే నాగ చైతన్య ఈ సినిమాతో తమిళ్ లో డెబ్యూ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాని నిర్మించగా, మే 12న ఈ సినిమా థియేటర్ లో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఒక పక్క నాగార్జున ఘోస్ట్ సినిమా ఫ్లాప్ అవడం, ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏజెంట్ సినిమా నిరాశపరచడంతో, కస్టడితో సినిమాతోనైన అక్కినేని ఫ్యామిలీని నాగ చైతన్య మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కిస్తాడేమో అనుకుంటే అది జరగలేదు. మంచి పాజిటివ్ వాతావరణంలో రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించినంత విజయం సాధించలేకపోయింది. కానీ మరీ ఏజెంట్, ఘోస్ట్ సినిమాలగా డిజాస్టర్ టాక్ మాత్రం రాకుండా పాజిటివ్, నెగిటివ్, మిక్సడ్ టాక్ ల మధ్య ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఇటీవలనే ఈ సినిమా థియేటర్ రన్ కంప్లిట్ చేసుకొని జూన్9 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవడానికి రెడీ అయింది. థియేటర్ గనక ఈ సినిమా మిస్ అయిన వాళ్ళెవరైనా ఉంటే అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 9న వస్తోన్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని మిస్ అవకండి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు