Adhipurush: సీతగా కృతి సనన్నే తీసుకోడానికి రీజన్ చెప్పిన ప్రభాస్

ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో వస్తోన్న ఆదిపురుష్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం (జూన్6) తిరుపతిలో ఘనంగా జరిగింది. తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, చిన్న జీయర్ స్వామి ప్రత్యేక అతిథిగా హాజరైన ఈ ఈవెంట్, ప్రభాస్ అభిమానుల కోలాహలం మధ్య అంగ రంగ వైభవంగా జరిగింది.

అత్యంత భారీ బడ్జెట్ తో, ఇండియాలోనే మోస్ట్ ఎక్స్ పెన్సివ్ సినిమాగా నిర్మించిన ఆదిపురుష్ సినిమా, వాల్మీకి రాసిన రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కింది. రాఘవ రాముడిగా ప్రభాస్, జానకిగా బాలీవుడ్ స్టార్ నటి కృతిసనన్ నటించారు.

విషయానికొస్తే బాలీవుడ్ మరియు టాలీవుడ్ ఇతర ఇండస్ట్రీలలో సీత క్యారెక్టర్ కి చాలా మందే ఆప్షన్స్ ఉండగా, కృతి సనన్ ని ఎందుకు తీసుకున్నారనే కన్ఫ్యూజన్ మొదటి నుంచి అందరిలోనూ ఉండింది. ఈ విషయంపై నిన్న జరిగిన ఆదిపురుష్ ప్రి రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ క్లారిటీ ఇవ్వడంతో, అందరి అనుమానాలు తీరిపోయాయి.

- Advertisement -

సాధారణంగా పాన్ ఇండియా సినిమా అంటే అన్ని భాషల ప్రేక్షకులు సినిమా చూడాలి. అప్పుడే సినిమా అందరికి రీచ్ అవుతుంది. అందుకే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్ అంత పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనగానే అన్ని ఇండస్ట్రీల నుంచి యాక్టర్స్ ని తీసుకుంటారు. దానివల్ల సినిమా మార్కెట్ కి హెల్ప్ అవుతుందని అందరి అభిప్రాయం. అయితే ఆదిపురుష్ సినిమాకి మాత్రం ఈ విధంగా జరగలేదు. దర్శకుడు ఓం రౌత్ భాష, ఇండస్ట్రీ ఇలాంటి విషయాలేవీ పట్టించుకోకుండా చాలా క్లారిటీతో తనకి ఏ పాత్రకి ఎవరు కావాలో వారినే తీసుకున్నారు. అయితే జానకి పాత్ర కోసం మాత్రం హీరోయిన్ వెతకడం చాలా కష్టమైందట.

సీత పాత్ర చేయాలంటే, అందం ఉండి, నటన మాత్రమే వస్తే సరిపోదు. ఆమె రియల్ లైఫ్ లో కూడా సీతలాంటి మనస్తత్వం ఉండాలనే ఉద్దేశ్యంతో ఓం రౌత్ కృతి సనన్ ని జానకిగా సెలెక్ట్ చేసినట్టు ప్రభాస్ ఆదిపురుష్ ప్రి రిలీజ్ ఈవెంట్ లో తెలియపరచాడు. అలాగే కృతి సనన్ గురించి ఆయన మాట్లాడుతూ ఆమె హావభావాలని పొగడ్తలతో ముంచేశాడు.అలాగే ఈ వేడుకలో ఆదిపురుష్ సినిమాకి సంబంధించి యాక్షన్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. ట్రైలర్ అందరిని ఆకట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16న రిలీజ్ అవబోతున్నఆదిపురుష్ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు