Dasara: ఓవర్సీస్‌లోనూ నాని తగ్గట్లేదు గా..

న్యాచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తన పరుగుని కొనసాగిస్తుంది. మార్చి 30 న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ భారీ ఓపెనింగ్స్ ని కొల్లగొట్టింది. మొదటి రోజే 38 కోట్లకి పైగా వసూలు చేసిన ఈ సినిమా, వారం రోజుల్లోనే టార్గెట్ ని బ్రేక్ చేసింది. ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యే సరికి 55 కోట్ల షేర్, 96 కోట్లకి పైగా గ్రాస్ ని వసూలు చేసింది. దసరా మూవీని సుకుమార్ శిష్యుడైన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. ఇతనికిదే తోలి సినిమా. దసరా మూవీ ని SLV సినిమాస్ బ్యానర్ లో చెరుకూరి సుధాకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల అయినప్పటినుంచి మూవీ కి కలెక్షన్ల లో కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. హిందీ లో భోళా వల్ల ఈ సినిమాకు థియేటర్లు దొరకలేదు. అక్కడ ఎంత ప్రమోట్ చేసిన లాభం లేకపోయింది. ఆ తర్వాత విడుదలైన మూడో రోజు నుంచే ఐపీల్ స్టార్ట్ అవడంతో ఆ దెబ్బ కుడా గట్టిగా పడింది. అయితే వీకెండ్ లో మాత్రం ఈ సినిమా దుమ్ములేపుతూ, సింగిల్ స్క్రీన్ లలో హౌస్ ఫుల్ అయి దుమ్ములేపుతుంది.

దసరా 8 రోజుల్లోనే 100 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది. 11 రోజుల్లో ఈ సినిమా 60 కోట్లకి పైగా షేర్ వసూలు చేసింది. టైర్ 2 హీరోల సినిమాల్లో ఇది రెండో సినిమా. ఇక తాజాగా దసరా మరో రికార్డు సృష్టించింది. అది కుడా ఓవర్సీస్ లో కావడం రికార్డ్. ఈ సినిమా విడుదలైన 12 రోజుల్లో ఓవర్సీస్ లో 2 మిలియన్ డాలర్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. నానికిది మొదటి 2 మిలియన్ డాలర్ల సినిమా. కాగా ఈ సంవత్సరం లో ఇది రెండవ సినిమా. అయితే నాని లాంటి క్లాస్ హీరో ఓవర్సీస్ లో ఒక మాస్ సినిమా తో 2మిల్లియన్లు సాధించడం విశేషం అని చెప్పాలి. ఇప్పటికే 110 కోట్లు దాటిన దసరా మూవీ కలెక్షన్ల రన్ ఎంత వరకు కొనసాగిస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు