Dhamaka : ఓటీటీ రిలీజ్ కు రెడీ…

వరుస ఫ్లాప్ లతో ఉన్న మాస్ మహారాజా రవితేజ నుంచి ఇటీవల వచ్చిన చిత్రం ధమాకా. త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ఈ మాస్ ఎంటర్ టైనర్ లో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి రోజు మిశ్రమ టాక్ ను అందుకుంది. కానీ తర్వాత అనూహ్యంగా.. కలెక్షన్లు పెంచుకుంటూ దూసుకెళ్లింది.

ఈ చిత్రం ఇటీవల రూ. 100 కోట్ల మార్క్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజ మాస్ యాక్షన్, కామెడీ తో పాటు శ్రీలీల డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాలో వచ్చే పల్సర్ బండి సాంగ్ ప్రేక్షకులను ఊర్రుతలుగించింది. కాగా ఈ చిత్రాన్ని థియేటర్ లో మిస్ అయిన వారు.. ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి తాజాగా ఓ గుడ్ న్యూస్ అందుతుంది. ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ పై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.

ఈ మోస్ట్ అవెయిటెడ్ చిత్రం జనవరి 22న నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుందని ఈ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా ప్రకటించింది. కాగా.. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తో పాటు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కూడా నిర్మించిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం ఓటీటీలో కూడా మంచి రికార్డ్స్ నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -

For More Updates : 

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు