Dhanush: సార్ ట్రైలర్ రిలీజ్

కోలీవుడ్ స్టార్ హీరోగా ధనుష్ తెలుగు ప్రేక్షకులను టార్గెట్ గా చేస్తున్న చిత్రం సార్. ధనుష్ తమిళ సినిమాలు తెలుగులో డబ్ అవడం వల్ల ఇక్కడ కూడా ఆయనకు మంచి క్రేజ్ ఉంది. ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్, మారి సినిమాలు తెలుగులోను మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. దీంతో ధనుష్ మార్కెట్ ను తెలుగులో విస్తరించాలని ప్లాన్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ స్టార్ ధనుష్ సార్ సినిమాతో వస్తున్నాడు. ఇది తమిళంలో వాతి పేరిట రూపొందుతోంది.

ఈ మూవీ ట్రైలర్ ను హైదరాబాద్ లోని ఏఎంబి సినిమాస్ లో లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కు ధనుష్, సంయుక్త హాజరయ్యారు. డబ్బును ఎలాగైనా సంపాదించవచ్చు కానీ మర్యాదను చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది అంటూ చదువుకున్న గొప్పదనం గురించి చెబుతాడు ధనుష్ ఈ ట్రైలర్ లో. దీనిని బట్టి ఈ సార్ కథ చదువు, ఆ చదువును వ్యాపారంగా మార్చేసిన వారి చుట్టూ తిరుగుతుందని స్పష్టం అవుతోంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ ఫిమేల్ లీడ్ రోలో కనిపిస్తోంది.

ఈ ట్రైలర్ లో ధనుష్, సంయుక్త మధ్య లవ్ ట్రాక్ ను కూడా చూపించారు. ఇక విలన్ రోల్ లో సముద్రఖని నటించాడు. చదువును అమ్ముకునే ఓ విద్యా వ్యాపారవేత్తగా, సార్ మూవీలో అతడు కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన మాస్టారూ మాస్టారూ అనే మెలోడీ సాంగ్ ను కూడా ఈ ట్రైలర్ లో ఉంచారు. కాగా, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాను నిర్మించాయి. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించాడు. ఫిబ్రవరి 17న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.

- Advertisement -

For More Updates : 

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు