Kollywood: ఈ డబ్ మూవీస్ సొంత భాషలో కంటే ఇక్కడే పెద్ద హిట్ అని తెలుసా

తమిళ్ సినిమాలు తెలుగు లో డబ్ అయ్యి బ్లాక్ బస్టర్స్ అవ్వడం చాలా కామన్. కానీ కొన్ని సినిమాలు వాటి ఒరిజినల్ లాంగ్వేజ్ కంటే ఎక్కువగా డబ్బింగ్ లాంగ్వేజ్ లో ఆడాయి. అంతేకాదు ఆ భాషలో ప్లాప్ అయిన సినిమాలు తెలుగులో హిట్ అవ్వడం కూడా అప్పుడప్పుడు జరుగుతుంది. ఇలా తమిళ్ నుండి తెలుగులో విడుదలై అక్కడికంటే పెద్ద హిట్ అయిన కొన్ని సినిమాలపై ఓ లుక్కేద్దాం.

7th సెన్స్: మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తమిళం లో అంతగా ఆడలేదు. కానీ తెలుగులో సూపర్ హిట్ గా నిలవడమే గాకుండా, ఒక్క నైజాం ఏరియాలోనే డిస్ట్రిబ్యూటర్ కి కోటిన్నర ప్రాఫిట్ తెచ్చిపెట్టింది.

24: సూర్య నటించిన ఈ సినిమా విక్రమ్.కే. కుమార్ దర్శకత్వంలో వచ్చింది. 2016 లో వచ్చిన ఈ సినిమా తమిళ్ లో ప్లాప్ అవగా తెలుగులో సూపర్ హిట్ అయింది.

- Advertisement -

యుగానికి ఒక్కడు: సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2010 లో విడుదలై సంచలన విజయం సాధించింది. కార్తీ హీరోగా నటించిన ఈ సినిమా తమిళ్ లో యావరేజ్ గా ఆడగా తెలుగులో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతే కాదు కార్తీకి ఈ సినిమా ద్వారానే తెలుగులో మంచి మార్కెట్ ఓపెన్ అయ్యింది.

బిచ్చగాడు2 : విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన ఈ సినిమా బిచ్చగాడు కి సీక్వెల్ గా రూపొందింది. రీసెంట్ గా వచ్చిన ఈ సినిమా తమిళ్ లో యావరేజ్ హిట్ కాగా, తెలుగులో కేవలం 6 రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించి సూపర్ హిట్ గా నిలిచింది.

ఇవే కాక చియాన్ విక్రమ్ నటించిన “ఐ”, శంకర్ తీసిన బాయ్స్, స్నేహితుడు సినిమాలు తమిళ్ లో ప్లాప్ అయ్యి తెలుగులో మాత్రం సూపర్ హిట్లయ్యాయి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు