Tollywood: చరణ్, తారక్‌కి ఉందేంటి.. బాలీవుడ్ హీరోలకు లేందేంటి ?

టాలీవుడ్ ఓ చిన్న పరిశ్రమ.. అనే దాని నుంచి టాలీవుడ్.. భారతీయ చలన చిత్రరంగం గర్వించదగ్గ ఇండస్ట్రీ, సినీ ప్రపంచాన్ని షేక్ చేసే ఇండస్ట్రీ అని మరోసారి రుజువు అయింది. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలితో మొదటిసారి తెలుగు ఇండస్ట్రీ గురించి చర్చించుకున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ విశిష్టత ఖండంతరాలు దాటింది. ప్రఖ్యాత ఆస్కార్ అవార్డ్ నే గెలిచి, టాలీవుడ్ ఘనతను విశ్వానికి చాటి చెప్పింది.

అయితే దీనికి కారణం రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్ తో పాటు హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా అని చెప్పొచ్చు. తారక్, చరణ్ కి ప్రస్తుతం వస్తున్న క్రేజీ అంతా ఇంత కాదు. ఏకంగా హాలీవుడ్ లో సినిమా ఛాన్స్ లు వచ్చేంత ఇమేజ్ ను వీరు దక్కించుకున్నారు. అయితే దశబ్దాల తరబడి సినీ ప్రపంచంలో గుర్తింపు ఉన్న బాలీవుడ్ హీరోలకు మాత్రం ఇలాంటి ఇమేజ్ ఇప్పటి వరకు రాలేదు. భవిష్యత్ లో వస్తుందా.. అని అంటే అది కూడా చెప్పడం చాలా కష్టం.

ఇదిలా ఉండగా, మెగా కుటుంబం నుంచి చరణ్, నందమూరి కుటుంబం నుంచి తారక్ వచ్చారు. ఈ రెండు కుటుంబాలకు కూడా మంచి పేరుంది. అలాగే వీరి పెళ్లి తర్వాత కూడా వారి వ్యక్తిగత జీవితం ఎలాంటి వివాదాస్పదాలకు చోటివ్వకుండా సాఫీగా సాగుతుంది. అలాగే వీరి సినిమా కెరీర్ గా బ్లాక్ బస్టర్ హిట్ అన్నట్టు సాగుతుంది. దీంతో “ఇంట గెలిచి.. రచ్చ గెలవాలి” అన్నట్టు ఈ స్టార్ హీరోలు ఇద్దరు ముందు ఇంట గెలిచారు.. తర్వాత బయట గెలుస్తున్నారు అంటూ కొంత మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ లిస్ట్ లో అల్లు అర్జున్ కూడా వస్తాడని చెప్పొచ్చు. పుష్ప సినిమాతో సూపర్ ఇమేజ్ తెచ్చుకున్న ఐకాన్ స్టార్.. తన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి వివాదాలకు చోటివ్వకుండా మంచి కొడుకుగా, భర్తగా, తండ్రిగా కొనసాగుతున్నాడు.

- Advertisement -

కానీ, బాలీవుడ్ లో ఇలాంటి పరిస్థితులు ఉండవు. వ్యక్తిగత వివాదాలు.. కుటుంబ పరమైన వివాదలు కుప్పలు తెప్పలుగా ఉంటాయి. అలాంటి వాళ్లు ప్రపంచం గుర్తించేంత ఇమేజ్ ను తెచ్చుకోవడం కష్టమే అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి కామెంట్స్ స్వయంగా బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు కూడా చేయడం గమనార్హం.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు