నాగచైతన్య తో రొమాన్స్ చేసి.. ఆ తర్వాత అతడికే తల్లిగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

సినిమాలకు, నిజజీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. నిజజీవితంలో రిలేషన్ బట్టి మర్యాదలు పెరుగుతుంటాయి. అయితే సినీ పరిశ్రమలో హీరోలు ఎన్నేళ్లు అయినా హీరోలుగా సినిమాలు చేస్తుంటారు. కానీ హీరోయిన్ల విషయంలో అలా కాదు. కొంతకాలం హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లు ఆ తర్వాత సహాయక పాత్రలకు పరిమితం అవుతుంటారు. ఒక నటుడికి భార్యగా కనిపించిన హీరోయిన్ మరో సినిమాలో అతడికి వదిన గానో, చెల్లి గానో, తల్లిగానో, లేదా మరో పాత్రలో కనిపించాల్సి రావచ్చు. అంతెందుకు ఎన్టీఆర్ కి మనవరాలిగా నటించిన శ్రీదేవి.. ఆ తర్వాత ఆయనతో హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో జోడి కట్టింది.

అయితే యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్యతో రొమాన్స్ చేసిన ఓ హీరోయిన్.. ఆ తర్వాత అతడికే తల్లిగా నటించింది. ఆ హీరోయిన్ ఎవరని ఆలోచిస్తున్నారా..? ఆమె మరెవరో కాదు అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. ఈ ముద్దుగుమ్మ 2017లో కృష్ణ మరిమత్తు దర్శకత్వంలో వచ్చిన యుద్ధం శరణం అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో హీరోయిన్ గా నాగచైతన్య తో రొమాన్స్ చేసింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగార్జునకు భార్య పాత్రలో నటించిన లావణ్య త్రిపాఠి.. ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన బంగార్రాజు అనే సినిమాలో నాగచైతన్యకు తల్లిగా కనిపించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి.

For More Updates :

- Advertisement -

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు