Anni Manchi Sakunamule: బాక్సాఫీస్ వెలవెల.. సంతోష్‌కు అన్నీ మంచి శకునములే !

తమను తాము ప్రూఫ్ చేసుకోవడానికి టాలీవుడ్ లో యంగ్ హీరోస్ చాలా మంది ట్రై చేస్తున్నారు. అలాంటి వారిలో సంతోష్ శోభన్ ఒకరు. రెబల్ స్టార్ ప్రభాస్ కు వర్షం లాంటి సూపర్ హిట్ మూవీని ఇచ్చిన డైరెక్టర్ శోభన్ కొడుకే ఈ సంతోష్ శోభన్. 2011లోనే గోల్గొండ హై స్కూల్ అనే సినిమాతో చైల్డ్ ఆర్డిస్ట్ గా సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన శోభన్.. వెండితెరపై హీరోగా చేయడానికి ఎంతో కాలం పట్టలేదు. “తను నేను” అనే సినిమాతో హీరోగా అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి సంతోష్ చాలా సినిమాల్లో నటించాడు. కానీ, హిట్.. సూపర్ హిట్ లాంటి పదాలు మాత్రం ఆయన కెరీర్ లో ఇప్పటి వరకు వినిపించలేదు.

ఆడియన్స్ ను ఈ యంగ్ హీరో సినిమాలు మెప్పించలేకపోతున్నా.. సంతోష్ యాక్టింగ్‌కు మాత్రం ప్రతిసారి మంచి మార్కులే పడుతున్నాయి. దీంతో ఎప్పుడో ఒక సారి తన సినిమా హిట్.. సూపర్ హిట్ అవుతుంది లే అనే కాన్ఫిడెంట్‌తో సంతోష్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు అదే నమ్మకంతో వస్తున్న మూవీ “అన్నీ మంచి శకనుములే”. నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. “ఈసారి వేసవికి చల్లని చిరుగాలి” అనే క్యాప్షన్ తో ఈ మూవీని ప్రమోట్ చేస్తున్నారు.

అయితే సంతోష్ శోభన్ కి ఈ సినిమా మంచి హిట్ ను ఇస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకు అనుకూలంగా, సంతోష్‌కు అన్నీ మంచి శకునములే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పోటీ లేదు. విరూపాక్ష తర్వాత వచ్చిన అన్ని సినిమాలకు నెెగిటివ్ టాక్ వచ్చింది. రామబాణం, ఉగ్రం, కస్టడితో పాటు మరి కొన్ని సినిమాలు నిజంగానే ఆడియన్స్ ను దారుణంగా నిరుత్సాహపరిచాయి. దీంతో సినీ లవర్స్ థియేటర్స్ కి రావడం కంటే, పార్క్ లకు వెళ్లి తమ సమ్మర్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

- Advertisement -

ఈ టైంలో ఒక మంచి సినిమా వస్తే.. హిట్ అవ్వడం పక్కా. అన్నీ మంచి శకునములే మూవీ ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇలాంటి సినిమాలకు ఫస్ట్ డే ఓపెనింగ్స్ అంతగా రాకపోవచ్చు. కానీ, టాక్ బయటికి వచ్చిన తర్వాత చిన్నగా జోరును పెరిగుతుంది. ఇప్పుడు అన్నీ మంచిశకునములే యూనిట్ కూడా ఇదే ధైర్యంతో ఉంది. వీకెండ్ వరకు టాక్ స్ప్రెడ్ అయితే, వీకెండ్ తర్వాత తమ సినిమాకు తిరుగండదు అని దర్శక నిర్మాతలు గట్టిగా చెబుతున్నారు. మరీ సంతోష్ శోభన్ అన్నీ మంచి శకునములే మూవీకి వచ్చిన ఈ శకునముు ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు