Box Office: ఏజెంట్ బిజినెస్.. టార్గెట్ పెద్దదే

అక్కినేని అఖిల్ హీరోగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న మూవీ ఏజెంట్. ఈ చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, ‘సురేందర్ 2 సినిమా’ బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిప్-హాప్ తమిజా ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. ఏజెంట్ లో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది.
ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు ట్రైలర్ సినిమా పై అంచనాల్ని విపరీతంగా పెంచేసాయి. ఈ మధ్యనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుపుకున్న ఈ సినిమా ఏప్రిల్ 28 న విడుదల కాబోతుంది.

ఏజెంట్ మూవీ యూ/ఏ సెన్సార్ సర్టిఫికెట్ ను సొంతం చేసుకోగా, తాజాగా ఈ సినిమాకు జరిగిన బిజినెస్ డీటెయిల్స్ బయటికి వచ్చాయి. ఏజెంట్ సినిమా అఖిల్ కెరీర్ లో భారీ బిజినెస్ జరుపుకుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 36 కోట్లకి పైగా బిజినెస్ జరుపుకుంది. ఒకసారి ఏరియా వారీగా జరిగిన బిజినెస్ గమనిస్తే నైజాం 10cr, సీడెడ్ 4.50cr, ఆంధ్ర 14.80cr టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో కలిపి 29.30 కోట్ల బిజినెస్ జరగగా కర్ణాటక రెస్ట్ అఫ్ ఇండియా కలిపి 3.80cr , ఓవర్సీస్ లో 3.10cr వరల్డ్ వైడ్ గా 36.20 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ సినిమా అఖిల్ కెరీర్లో రెండవ అత్యధిక బిజినెస్ జరుపుకుంది.

ఇంతకు మందు అఖిల్ సినిమాల్లో అత్యధిక బిజినెస్ జరుపుకున్న చిత్రం “అఖిల్ ది పవర్ అఫ్ జువా” ఈ సినిమా కు 42 కోట్ల బిజినెస్ జరగగా 20 కోట్లు మాత్రమే వసూలు చేసి డిజాస్టర్ అయింది. ఈ సినిమా అఖిల్ తొలి సినిమా కావడం విశేషం. ఆ తర్వాత అఖిల్ నటించిన ఏ సినిమా కు అంత బిజినెస్ జరగలేదు. ఇప్పుడు ఏజెంట్ సినిమా కు దాన్ని మించి కాకపోయినా ఆ రేంజ్ లో అయితే బిజినెస్ జరిగింది. మరి ఏప్రిల్ 28 న విడుదల అవుతున్న ఏజెంట్, జరిగిన బిజినెస్ టార్గెట్ ను అందుకుంటుందో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు