Mahesh: గుంటూరు కారం సినిమా మరో కొత్త ట్విస్ట్- ఏం జరుగుతుంది గురూజీ అసలు

మరీ ఏ ముహూర్తాన త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా మొదలు పెట్టారో కానీ రోజుకో ట్విస్ట్ తో, నిత్యం గందరగోళంగా, అయోమయంగా ఈ సినిమా షూటింగ్ సాగుతుంది. గత కొద్దీ కాలంగా నిత్యం కాంట్రవర్సీలకు తప్ప షూటింగ్ కు నోచుకోని ఈ సినిమా ఇటీవలనే అన్నీ సమస్యలను సవరించుకొని మళ్ళీ ఫ్రెష్ గా షూటింగ్ స్టార్ట్ చేసింది.

ఇక అంత సవ్యంగానే జరుగుతుంది అనే సమయంలో మరో కొత్త ట్విస్ట్ ఇచ్చింది మూవీ టీం. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా మొదటగా ప్రారంభించినపుడు పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా, శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా షూటింగ్ మొదలైంది. ఒక రెండు, మూడు షెడ్యూల్స్ షూటింగ్ కూడా సక్సెస్ ఫుల్ గా ఫినిష్ చేసాక, పూజా హెగ్డే ను సినిమాలో నుంచి తీసేసారు.

ఇక ఆ తరువాత సెకండ్ హీరోయిన్ గా ఉన్న శ్రీలీలను మెయిన్ హీరోయిన్ గా, మీనాక్షి చౌదరిని సెకండ్ హీరోయిన్ గా తీసుకొని మళ్ళీ కొత్త సినిమా తీయడం స్టార్ట్ చేసారు. ఇటీవలనే ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా కంప్లిట్ అయ్యాక మరో వ్యక్తి సినిమా నుంచి తప్పుకున్నాడనే వార్త గట్టిగ వినిపిస్తుంది.

- Advertisement -

ఇక లేటెస్ట్ గా గుంటూరు కారం చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న పీఎస్ వినోద్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు సమాచారం అందుతోంది. ఇష్యూ ఏంటో క్లారిటీ లేకపోయిన త్రివిక్రమ్ కు పీఎస్ వినోద్ కు తరుచూ మనస్పర్థలు వస్తుండటంతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.

ఇక ఆయన ప్లేస్ లో ప్రస్తుతం ఒజి సినిమాకు కెమెరామెన్ గా పని చేస్తున్న రవి కె చంద్రన్ ను గుంటూరు కారం సినిమాకు కొత్త సినిమాటోగ్రాఫర్ గా తీసుకున్నరని టాక్ నడుస్తుంది. సరే తీసుకుంటే తీసుకున్నారు పోనీ ఇక నుంచైన షూటింగ్ సవ్యంగా చేస్తారా అంటే మహేష్ వెకేషన్ పేరుతో మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోయాడు. దీని బట్టి చూస్తే గుంటూరు కారం సినిమా అంత ప్రస్తుతం టాలీవుడ్ లోనే అత్యంత గందరగోళం సినిమా అయిపోయిందనిపిస్తుంది. మళ్ళీ మహేష్ తిరిగి ఎప్పుడు వస్తాడో.. షూటింగ్ ఎప్పటికి అవుతుందో.. ఆయన వచ్చేలోపు ఈ టీం అయిన ఇలాగే ఉంటుందో, ఉండదో అని అందరికి అనుమానాలు తెలెత్తుతున్నాయి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు