Hansika: నా భర్త విడాకులకి నేను కారణం కాదు

2007లో అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన కోలీవుడ్ ముద్దుగుమ్మ హన్సిక గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. దేశముదురు సినిమాలో హీరోయిన్ గా తన నటనతో మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, రామ్ వంటి పలువురు స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించింది.

ఇదిలా ఉంటే ఈమె గత ఏడాది లవ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. గత డిసెంబర్ 4న తన బెస్ట్ ఫ్రెండ్ సోహైల్ కథురియా ను వివాహమాడింది. తాజాగా ఆమె వెడ్డింగ్ వీడియోని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల చేశారు. ” లవ్ షాది డ్రామా” టైటిల్ తో ఈ వీడియో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ వీడియోలో తన పెళ్లికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించింది హన్సిక.

“పెళ్లి గురించి రహస్యంగా ఉంచాలి అనుకున్నాను. కానీ నాకు తెలియకుండానే పెళ్లి గురించి వార్తలు వైరల్ అయ్యాయి. అది నాకు ఏమాత్రం నచ్చలేదు. పైగా సోహైల్ గురించి, తన విడాకులకు నేను కారణం అంటూ వస్తున్న వార్తల గురించి విని చాలా ప్రెజర్ ఫీల్ అయ్యాను. ఆ సమయంలో ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు మా అమ్మ ఓ సలహా ఇచ్చింది. మా అమ్మ ఇచ్చిన సలహాతో సోహెల్ నాకు ప్రపోజ్ చేస్తున్న ఫోటోని షేర్ చేశాను. దాంతో అందరూ విష్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ మళ్లీ సోహెల్ గతంలో పెళ్లి గురించి డిస్కషన్ మొదలైంది. గతంలో నేను సోహెల్ పెళ్లికి వెళ్ళిన ఫోటోని వైరల్ చేసి వారి విడాకులకు నేనే కారణం అని అన్నారు. అది నన్ను ఎంతగానో బాధించింది. వారు విడిపోవడానికి నేను కారణం కాదు” అంటూ చెప్పుకొచ్చింది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు