Satyabhama: వెండితెర మిత్రవిందకు జన్మదిన శుభాకాంక్షలు!

టాలీవుడ్ లో ఒక యువరాణి ఉండేది. ఆ రాణి పేరు కాజల్ అగర్వాల్. తెలుగు తెరకు లక్ష్మి గా పరిచయమై, చందమామ గా అలరించి మిత్రవింద గా యువరాణి అయ్యి, టాలీవుడ్ ని ఏలిన మహారాణి. పదిహేనేళ్ల పాటు తెలుగు తెరను అలరించి ఆ తరువాత “గౌతమ్ కిచ్లు”ని పెళ్లి చేసుకుని ముంబై వెళ్ళిపోయిన ఈ భామ ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అయితే వెండి తెరను వీడలేక మళ్ళీ సినిమాలే లోకం ఉంటూ మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి రీఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఈరోజు కాజల్ అగర్వాల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తనకి “filmify” టీమ్ తరపున బర్త్ డే విషెస్ తెలియచేస్తూ కాజల్ జర్నీ గురించి చెప్పుకుందాం.

ముంబై లో పుట్టిన కాజల్ సినిమాలపై మక్కువతో మోడలింగ్ లోకి ప్రవేశించింది. పలు యాడ్స్ లో నటిస్తూ హిందీలో “క్యూ.. హో గయా నా” సినిమాలో సైడ్ క్యారెక్టర్ లో మెరిసింది. అప్పుడే డైరెక్టర్ తేజ కంట్లో పడింది. ఆయన తీసిన లక్ష్మి కళ్యాణం ద్వారా టాలీవుడ్ కి పరిచయమయ్యింది ఈ భామ. కృష్ణవంశీ తీసిన చందమామతో గుర్తింపు పొందిన ఈ భామ రాజమౌళి తీసిన “మగధీర” తో ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ అయిపొయింది. వరుస సినిమాలు చేస్తూ సౌతిండియా లోనే బిజీయెస్ట్ హీరోయిన్ అయ్యింది.

టాలీవుడ్ లో అత్యధిక హీరోలతో హీరోయిన్ గా నటించిన కాజల్ కి ఎవ్వరికీ లేని రికార్డు ఉంది. టాలీవుడ్ టాప్ హీరోలైన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీళ్లందరితో సినిమాలు చేసిన కాజల్, సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ సినిమాల్లోనూ నటించి మెప్పించింది.

- Advertisement -

గ్లామర్ పరంగానే కాక నటన పరంగాను ఆకట్టుకుంది. డార్లింగ్ లో నందిని గా, MR పర్ఫెక్ట్ లో ప్రియ గా, బిజినెస్ మెన్ లో చిత్ర, ఇలా దేనికవే డిఫరెంట్ రోల్స్ తో ఆకట్టుకుంది. ఏకంగా నాలుగు సార్లు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ గెలుచుకుందంటే తన ప్రతిభ అర్ధం చేసుకోవచ్చు. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లోనూ నటించిన కాజల్ టాలీవుడ్ ని తన హోమ్ గ్రౌండ్ అని ఎప్పుడు చెప్పుకుంటుంది. తాను ఎక్కడికెళ్లినా టాలీవుడ్ ప్రస్తావన తీయని రోజు ఉండదని అంటూ ఉంటుంది.

టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంతో మంచి పేరున్న కాజల్ కొంత గ్యాప్ తర్వాత తెలుగులో మళ్ళీ సినిమాలతో రీ ఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం బాలయ్య సరసన భగవంత్ కేసరి లో నటిస్తున్న కాజల్ త్వరలో తన 60 వ సినిమాగా తెరకెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో “సత్యభామ” ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి రెడీ అవుతుంది. తాజాగా బర్త్ డే కానుకగా రిలీజ్ అయిన టీజర్ తో ఆకట్టుకుంది. ఆ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న కాజల్ డిఫరెంట్ మేకోవర్ తో తనదైన ఆటిట్యూడ్ తో ఆకట్టుకుంది.

టాలీవుడ్ లో రీ ఎంట్రీ తర్వాత కూడా అదే క్రేజ్ ని కంటిన్యూ చేస్తున్న కాజల్ అగర్వాల్ ఈ సినిమాతో మంచి కంబ్యాక్ హిట్టు కొట్టి మళ్ళీ తన జోరు చూపించాలని కోరుకుందాం.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు