Happy Birthday: విలక్షణ హీరో కార్తీకి జన్మదిన శుభాకాంక్షలు

విలక్షణ నటుడు బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కార్తీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్ లో టాప్ హీరో అయిన సూర్య తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చి తన సినిమాలతో విలక్షణ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోను మంచి స్టార్ డమ్ తెచ్చుకున్న నటుడు కార్తీ. ఈరోజు కార్తీ పుట్టిన రోజు ఈ సందర్భంగా filmify టీమ్ తరపున తనకి బర్త్ డే విషెస్ తెలియచేస్తూ కార్తీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం.

కార్తీ 1977 మే 25న చెన్నైలో తమిళ నటుడు శివ కుమార్, లక్ష్మి దంపతులకు జన్మించాడు. ఫిల్మ్ బాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కావడంతో చిన్నతనం నుంచే సినిమాలపై ఆసక్తి తో డైరెక్టర్ కావాలనుకున్నాడు. చెన్నైలోనే ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజ్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన కార్తీ, ఆ తర్వాత మణిరత్నం దగ్గర 2004 లో వచ్చిన “ఆయుత ఏంజుత్తు”(యువ) సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు. ఆ తర్వాత తన అన్నయ్య సూర్య, ఇంకా మణిరత్నం సలహా తో సినిమాల్లో యాక్టింగ్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టాడు.

అలా 2007 లో “పరుత్తి వీరన్” తో హీరో గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. ఆ తర్వాత 2010 లో వచ్చిన “అయిరతిల్ ఒరువన్” సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ సినిమా “యుగానికి ఒక్కడు” పేరుతో తెలుగులోనూ డబ్ అయ్యి ఇక్కడా సంచలన విజయం సాధించింది. ఈ మూవీలో కార్తీ చేసిన పెర్ఫార్మన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. ఇక అదే సంవత్సరం లో వచ్చిన “ఆవారా” కార్తీకి యూత్ లోను మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత నా పేరు శివ, సిరుతై సినిమాలతో స్టార్ హీరో అయ్యాడు.

- Advertisement -

ఊపిరి, ఖాకి, ఖైదీ వంటి సినిమాల్లో నటించడమే గాకుండా తన విలక్షణ నటనతో మెప్పించాడు. ఇక తన అన్న సూర్య, వదిన జ్యోతికలతో కార్తీకి ఎంతో మంచి అనుబంధం ఉంది. బయట ఈ ఫ్యామిలీ ఎప్పుడు కనిపించినా కలిసే కనిపిస్తారు. ఇక వదిన జ్యోతిక తో “తంబీ” సినిమాలో తమ్ముడిగా నటించడం విశేషం. అయితే అన్న సూర్య తో ఇప్పటివరకు స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయిన కార్తీ ఇప్పుడు లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఖైదీ2 సినిమాలో ఇద్దరు కలిసి నటించబోతున్నారు.

ఇక 2011 లో కార్తీ రంజని చిన్న స్వామిని పెళ్లి చేసుకున్నాడు. తనకి ఇద్దరు పిల్లలు. ఇక కార్తీ సినిమాల్లో సింగర్ గా కూడా తన ప్రతిభ చాటుకున్నాడు. 2013 లో తాను నటించిన “బిరియాని” సినిమాలో “మిసిసిపి” అని పాట పాడాడు. ఆ తర్వాత తెలుగులో రీసెంట్ గా శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం మూవీలోను పాట పాడడం జరిగింది.

అయితే తమిళంతో పాటు తెలుగులోనూ సమానం ఫాలోయింగ్ ను కలిగి ఉన్నాడు కార్తీ. తెలుగులో డబ్ అయిన ఆవారా, నా పేరు శివ, ఖాకి, సుల్తాన్, సర్దార్ వంటి సినిమాలతో ఇక్కడా సూపర్ హిట్లు కొట్టాడు. తెలుగులో చక్కగా మాట్లాడే తమిళ హీరోల్లో కార్తీ ఒకరు. తన ప్రతి సినిమాకి తెలుగులో కూడా సొంత డబ్బింగ్ చెప్పుకుంటాడు కార్తీ. తెలుగులో ఇంత ఫాలోయింగ్ రావడానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. అంతే కాదు ఓ ప్రముఖ ఈవెంట్ లో యాంకర్ సుమ తమిళ్ ఆడియన్స్ ఎక్కువ ఇష్టమా? తెలుగు ఆడియన్స్ ఎక్కువ ఇష్టమా? అని అడిగితే ఖచ్చితంగా తెలుగు ఆడియన్సే అని నిర్మొహమాటంగా చెప్పాడు. ఆ ఇష్టమే తెలుగులో ఊపిరి సినిమాలోనూ నటించడానికి కారణం అయింది. తెలుగులో రజినీకాంత్, సూర్య తర్వాత అంతటి క్రేజ్, గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తియే. తాజాగా పొన్నియిన్ సెల్వన్, సర్దార్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ కొట్టిన కార్తీ, ప్రస్తుతం “జపాన్” సినిమాలో నటిస్తున్నాడు. ఇలాగే మంచి సినిమాలు చేస్తూ తన స్టార్ డమ్ పెంచుకుంటూపోవాలని ఆశిస్తూ మరొక్కసారి కార్తీకి filmify టీమ్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు