Hi Nanna Trailer : మహి కోసం నాన్న.. నాన్న కోసం యశ్న..

న్యాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం “హాయ్ నాన్న”. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా, బేబీ కియారా కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటినుండే సినిమా పై మంచి అంచనాలు పెరిగిపోయాయని తెలిసిందే. ఇక రిలీజ్ చేసిన టీజర్ తో పాటు సాంగ్స్ కూడా చాలా బాగుండి మెప్పించాయి. డిసెంబర్ 7న రిలీజ్ కాబోతున్న హాయ్ నాన్న ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

ట్రైలర్ చూసాక ఒక్కమాటలో చెప్పాలంటే ఖచ్చితంగా ఒక ఫీల్ గుడ్ లవ్& ఎమోషనల్ మూవీని చూడబోతున్నామని ట్రైలర్ నమ్మకాన్ని ఇచ్చింది. ట్రైలర్ లో నాని తన కూతురి ఇమ్యాజిన్ లో తన ఫ్యామిలీ స్టోరీ చెప్తాడు. అమ్మ లేని తన కూతురు మహి అమ్మ ప్రేమ కావాలని కోరుకుంటుంది. అలాంటి టైం లో యాశ్న తన జీవితంలోకి వస్తుంది. ఈ అమ్మాయి ని నాని అంగీకరిస్తాడా? మహికి అమ్మ ప్రేమ దొరుకుతుందా అన్నది స్టోరీ గా డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. ఇంతకు ముందు చూసిన సినిమాల్లో కథే అయినా డైరెక్టర్ శౌర్యువ్ తన స్టైల్ లో సినిమా డైరెక్ట్ చేసాడని తెలుస్తుంది.

- Advertisement -

ఇక ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ గా హేషం అబ్దుల్లా మ్యూజిక్ నిలుస్తుందని పాటల ద్వారా ఇప్పటికే ప్రూవ్ అవగా, ట్రైలర్ లో ఇచ్చిన బీజీఎమ్ తో మరోసారి తెలిసింది. ఇక ట్రైలర్ కట్స్ కూడా బాగుండగా, మేకింగ్ క్వాలిటీ సూపర్ గా ఉంది. మరి హాయ్ నాన్న థియేటర్లో ఏ మేరకు ప్రేక్షకుల్ని మెప్పిస్తాడో చూడాలి.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు