Tollywood: భారీగా పెంచిన శ్రీలీల – అసూయ పడుతున్న హీరోయిన్లు..!

పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు తెరపై హీరొయిన్ గా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది కన్నడ భామ శ్రీలీల. ఆ తర్వాత రవితేజ సరసన నటించిన ధమాకా సినిమాలో తన అందం అభినయంతోనే కాకుండా డాన్స్ తో కూడా ఆకట్టుకొని టాప్ హీరోయిన్ స్థాయి క్రేజ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన శ్రీలీల అరడజనుకి పైగా సినిమాలను లైనప్ లో పెట్టి దూసుకుపోతోంది. కెరీర్ ఆరంభించిన అనతి కాలంలోనే పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ సాధించి అందరిని ఆశ్చర్యపరిచిన శ్రీలీల, తాజాగా చిరంజీవి సినిమాలో కూడా ఛాన్స్ అందుకుందని వార్తలొస్తున్నాయి.

మొదటి సినిమాకు 50లక్షల లోపే రెమ్యునరేషన్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ, ధమాకా సినిమాకి కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకుంది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవటంతో రెమ్యునరేషన్ అమాంతం పెంచిన శ్రీలీల ప్రస్తుతం 2.5కోట్ల మేర డిమాండ్ చేస్తుందని సమాచారం. శ్రీలీల క్రేజ్ కూడా రోజురోజుకి పెరిగిపోతుండటం వల్ల నిర్మాతలు కూడా భారీ రెమ్యునరేషన్ ఇవ్వటానికి వెనకాడట్లేదని అంటున్నారు. ఇదే గనక నిజమైతే తోటి హీరోయిన్స్ శ్రీలీలను చూసి అసూయ పడటం ఖాయం. చూస్తోంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెతని శ్రీలీల కరెక్ట్ గా ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది.

హీరోయిన్ల కెరీర్ స్పాన్ తక్కువ ఉన్న మన ఇండస్ట్రీలో హిట్స్ ఉన్నప్పుడు రెమ్యునరేషన్ పెంచటం అన్నది సాధారణమైన విషయమే కానీ, సినిమా బడ్జెట్ తో సంబంధం లేకుండా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయటం సమంజసం అనిపించుకోదు. 2.5 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న శ్రీలీల సినిమాల్లో తన పాత్రకు ఎక్కువ స్కోప్ ఉండేలా కథలు ఎంచుకుంటే ఇండస్ట్రీలో లాంగ్ టర్మ్ కెరీర్ కొనసాగించే అవకాశం ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు