Megastar: శ్రీలీల స్పీడ్ తగ్గట్లేదుగా – మరో క్రేజీ ప్రాజెక్ట్..!

పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది కన్నడ భామ శ్రీలీల. పెళ్లి సందడి సినిమా పెద్దగా అలరించకపోయినా శ్రీలీలకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత రవితేజ సరసన ధమాకా సినిమాతో హిట్ అందుకొని తన సత్తా చాటింది. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది శ్రీలీల, ఇప్పటికే అరడజనుకి పైగా క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైనప్ లో పెట్టిన శ్రీలీల మరో క్రేజీ అఫర్ తన ఖాతాలో వేసుకుందని వార్తలొస్తున్నాయి. మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మాతగా ‘సోగ్గాడే చిన్ని నాయన’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందనున్న సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల ని కన్ఫామ్ చేసినట్లు సమాచారం అందుతోంది.

ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయని ఈ ప్రాజెక్ట్ లో చిరంజీవితో పాటు ఓ యంగ్ హీరోకి కూడా స్కోప్ ఉండటంతో ఆ పాత్రకి సిద్దూ జొన్నలగడ్డ ని కన్ఫామ్ చేయగా ఆ పాత్రకి హీరోయిన్ గా శ్రీలీల నటించబోతోంది అని సమాచారం. ఇదే గనక నిజం అయితే శ్రీలీల రేంజ్ టాప్ హీరోయిన్ స్థాయికి పెరిగినట్లే అని చెప్పవచ్చు. అందం అభినయంతో పాటుగా డాన్స్ లో కూడా శ్రీలీల ఆకట్టుకుంటూ ఉండటం వల్ల అందరు దర్శక నిర్మాతలకు ఫస్ట్ ఛాయస్ గా మారింది.

డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో శ్రీలీల నటిస్తోందని వార్తలొచ్చినప్పటికీ అవి గాసిప్స్ గానే మిగిలాయి. ప్రస్తుతం వస్తున్న వార్తలు నిజమే అయితే త్వరలోనే సిద్దు, శ్రీలీల జంట ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది. ఇప్పటికే యువ హీరోలందరి సరసన ఆఫర్లు సంపాదించిన శ్రీలీల బాలకృష్ణ 108వ సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది. ఇప్పుడు చిరంజీవి సినిమాలో ఆఫర్ గనక నిజమే అయితే కెరీర్ ఆరంభించిన అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ స్థానానికి ఎదిగిన ఘనత శ్రీలీలకి దక్కుతుంది. మరి, శ్రీలీలకి మెగా ఆఫర్ అందింది అన్న వార్తల్లో నిజమెంతో తేలాలంటే కొంత కాలం వేచి చూడక తప్పదు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు