Gumraah: స్క్రిప్ట్ విషయంలో ఎంతో కేర్ గా ఉంటానన్న సీత

సీతారామం సినిమాతో తెలుగు లో ఎంట్రీ ఇచ్చి సీత గా ఎంతో మంచి పేరును సంపాదించుకుని తెలుగు ఆడియన్స్ మనసులో నిలిచింది మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం ఈ హీరోయిన్ నటించిన హిందీ చిత్రం గుమ్రా విడుదలకి సిద్ధంగా ఉంది. ఆ తర్వాత తెలుగు లో నాని హీరోగా చేస్తున్న 30 వ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించనుంది. అయితే ఈ సినిమా తర్వాత మరే ప్రాజెక్ట్ కూడా ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. చాలా నెమ్మదిగా మూవీస్ చేసే మృణాల్ మంచి పాత్రల్ని ఎన్నుకోవడంలో ముందుంటుంది.

అయితే మృణాల్ ఠాకూర్ నటించిన గుమ్రా సినిమా తమిళం లో వచ్చిన “తడం” సినిమాకి రీమేక్. ఈ సినిమా తెలుగు లో కూడా రామ్ హీరోగా రెడ్ పేరుతో రీమేక్ చేసారు. ఇక ఇప్పుడు హిందీలో ఆదిత్య రాయ్ హీరోగా చెయ్యడం జరిగింది. ఈ సినిమా లో మృణాల్ ఠాకూర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది. ఏప్రిల్ 7 న విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి.

“గుమ్రా” సినిమా ప్రమోషన్ లో భాగంగా మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది. తాను స్క్రిప్ట్ సెలక్షన్ లో ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటానని, మినిమం తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉండేలా చూసుకుంటాను అని అంది. అంతే కాదు క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎక్సపోసింగ్ చేయడానికైనా రెడీ, కానీ అవసరం లేకపోయినా చేయాల్సి వస్తే సినిమా అయినా వదులుకుంటాను గాని నచ్చని పని చెయ్యను అని చెప్పింది. సీతారామం లాంటి మూవీస్ లో ఆఫర్స్ వస్తే రెమ్యూనరేషన్ కూడా డిమాండ్ చెయ్యనని, అలాంటి సినిమాలు రేర్ గా వస్తాయి, వచ్చినపుడు చేసేయాలి అని చెప్పింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు