RE Release: మళ్లీ విడుదలవుతున్న నితిన్ ప్రేమ కావ్యం

నితిన్ హీరోగా నటించిన ఇష్క్ సినిమా అప్పట్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. కె.విక్రమ్ కుమార్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. 2012 లో విడుదలైన ఈ సినిమా మంచి మ్యూజికల్ హిట్ గా నిలవడమే కాకుండా వరుస పరాజయాలతో ఉన్న నితిన్ కి 12 సినిమాల తర్వాత మంచి బ్రేక్ ఇచ్చింది.నిత్యా మీనన్ కి కూడా మంచి బ్రేక్ ఇచ్చి వరుస ఆఫర్స్ తో బిజీ అయ్యేలా చేసింది.

అందుకే నితిన్ కి, అలాగే తన ఫ్యాన్స్ కి ఈ సినిమా చాలా ఇష్టం. అలాగే విక్రమ్ కుమార్ ని స్టార్ డైరెక్టర్ ని చేసింది ఈ సినిమా. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన పాటలన్ని సూపర్ హిట్స్ అయ్యాయి. ఈ సినిమాతో అనూప్ రూబెన్స్ ఇండస్ట్రీ లో వరుస ఆఫర్స్ దక్కించుకున్నాడు.

నిత్యా మీనన్ కధానాయికగా నటించిన ఈ సినిమా లో అజయ్, సుధ, అలీ, సింధు తులాని తదితరులు ప్రత్యేక పాత్రను పోషించగా శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో నిర్మించారు. ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ అవుతుంది. మార్చి 29 న నితిన్ బర్త్ డే కానుక గా ఈ చిత్రాన్నీ రీ రిలీజ్ చేస్తున్నట్టు ఆ సినిమా ప్రొడ్యూసర్ ప్రకటించడం జరిగింది. ఈ మధ్య రిలీజ్ అయిన మాచర్ల నియోజకవర్గం అంతగా ఆకట్టుకోకపోవడంతో డీలా పడిన ఫ్యాన్స్ కి ఇది కొంచెం ఊరటనిస్తోంది. ప్రస్తుతం వెంకీ కుడుముల తో మూవీ ని చేస్తున్న నితిన్ తన రీ రిలీజ్ చిత్రం కోసం ఫ్యాన్స్ తో పాటు తను కూడా వెయిట్ చేస్తున్నట్టు తెలిపారు.

- Advertisement -

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు