RC15: మహేష్ ని మించిపోతుందనుకుంటే యష్ ని గుర్తు చేసింది

ఈరోజు (మార్చి 27) ఉదయం రివీల్ చేసిన రామ్ చరణ్ కొత్త చిత్రం యొక్క టైటిల్ మెగాభిమానులకు అస్సలు నచ్చలేదు. “గేమ్ చేంజర్” అనే టైటిల్ తో దిల్ రాజు తన ట్విట్టర్ ద్వారా చెప్పగా మెగా అభిమానులు మాత్రం CEO, సర్కారోడు లాంటి టైటిల్ పెట్టుంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.

ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్నకొత్త సినిమా పోస్టర్ ని రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ నిన్న మేకర్స్ విడుదల చేయడం జరిగింది. లాంగ్ హెయిర్, లైట్ గడ్డం తో సిగిరెట్ తాగుతూ అలా నడుస్తూ వస్తున్న మహేష్ లుక్ ని చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. పోకిరి తర్వాత మళ్ళీ అలాంటి లుక్ లో సిగిరెట్ తో మహేష్ కనిపించడంతో ఫ్యాన్స్ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ముందే ఫిక్స్ అయిపోయారు.

ఇక మహేష్ లుక్స్ కి సాధారణ సినీ ప్రేక్షకులే కాదు రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ అభిమానులు సైతం ఈ లుక్ కి ఫిదా అవుతున్నారు. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ మాత్రం ఫ్యాన్స్ కి కూడా నచ్చలేదని అర్ధమవుతుంది.

- Advertisement -

ఎందుకంటే అది ఒక ఫ్యాన్ మేడ్ పోస్టర్ లా ఉంది తప్ప సినిమా పోస్టర్ లా అస్సలు లేదని పైగా అందులో రామ్ చరణ్ లుక్ “యష్” ని పోలి ఉందని మెగా ఫ్యాన్స్ దిల్ రాజు మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక శంకర్ ని కూడా  ట్విట్టర్ లో మెగా ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. మహేష్ కొత్త సినిమా లుక్ తో పోలుస్తూ త్రివిక్రమ్ ని చూసి నేర్చుకోవాలని శంకర్ కి ఉచిత సలహాలిస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు