Kangana Ranaut: మరోసారి తెరపైకి

బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్‌ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు కంగనా రనౌత్ సినిమా విజయాలతో పాటు సోషల్ మీడియాలో వివాదాలు కూడా ఆమెకు అలవాటే. నిత్యం ఏవేవో స్టేట్మెంట్స్ ఇస్తూ వివాదాలకు తెరలేపుతుంది కంగనా. గతంలో దర్శకుడు క్రిష్ తో జరిగిన వివాదం. సుశాంత్ సింగ్ మరణం అప్పుడు చేసిన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇలా ఉదాహరణలు చెప్పడానికి బోలెడు ఉన్నాయి. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కంగన, తమిళ్‌లో ‘చంద్రముఖి2’ చిత్రంలో నటిస్తోంది. రీసెంట్ గా కంగనా ఫ్యాన్స్‌తో #askkangana పేరుతో చిట్ చాట్‌ జరిపింది.

సోషల్ మీడియాలో ఎదురైనా అభిమానుల ప్రశ్నలకు సమాధానాలిస్తూ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఓ అభిమాని.. ‘‘హృతిక్ రోషన్, దిల్జీత్ దొసాంజే లో మీ ఫేవరెట్ నటుడు ఎవరు’’ అని అడిగాడు. మాములుగా ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు డిప్లమేటిక్ గా ఆన్సర్స్ వస్తాయి. కానీ కంగనా తీరు వేరు.

ఆ ప్రశ్నకు సమాధానిమిస్తూ హృతిక్ రోషన్ కి, దిల్జీత్ దొసాంజే కి నటన రాదని చెప్పింది. కంగనా ‘వారిలో ఒకరు యాక్షన్, మరొకరు మ్యూజిక్ వీడియోస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నిజం చెప్పాలంటే వారిద్దరు నటిస్తుండగా నేను చూడలేదు. ఒకవేళ వారు నటిస్తే నాకు ఒక సారి చెప్పండి’’ అని కంగనా రనౌత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. హృతిక్ రోషన్ తో తాను గతంలో డేటింగ్ చేశాను అని కంగనా రనౌత్ గతంలో పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు