Keerthy Suresh: రీటా రివాల్వర్ ఎందుకు పట్టింది?

మహానటి కీర్తి సురేష్ వరుస సినిమాలతో గడిపేస్తుంది. 2022లో మొత్తం 4 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కీర్తి సురేష్, 2023 ను కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తోంది. గతేడాది ఈమె నటించిన నాలుగు సినిమాల్లో సర్కారు వారి పాట మినహా అన్ని సినిమాలు పెద్దగా ఫలితాలను ఇవ్వలేదు. హిట్.. ఫ్లాప్ అనే సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది. కీర్తి సురేష్.. హీరో కు జోడీగా ఉండే హీరోయిన్ పాత్రలే కాదు.. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తుంది.

తాజాగా ఈ ఏడాది కీర్తి సురేష్ నుంచి దసరా, భోళా శంకర్ సినిమాలతో పాటు మరో నాలుగు సినిమాలు వస్తున్నాయి. అందులో ‘రివాల్వార్ రీటా‘ కూడా ఒకటి. ఫీమేల్ సెంట్రిక్ మూవీగా వస్తున్న దీన్ని దర్శకుడు చంద్రూ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో రెడిన్ కింగ్ల్సే మరో కీలక పాత్ర పోషిస్తున్న చిత్ర యూనిట్ నుంచి ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చింది. కాగా ఈ సినిమా నేపథ్యం గురించి డైరెక్టర్ చంద్రూ ఓ ఇంటర్వ్యూలో పలు కీలక అంశాలను వెల్లడించారు.

“హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు అంటే సీరియస్ గా ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ మా చిత్రం రివాల్వార్ రీటా యాక్షన్‌ కామెడీ జానర్‌లో రూపొందిస్తున్నాం. చిత్రంలో కీర్తి సురేష్ మధ్య తరగతికి చెందిన రీటా అనే యువతి పాత్రలో కనిపించబోతున్నారు. సాధారణ జీవితం గడిపే రీటా, ఒక సందర్భంలో రివాల్వార్ పట్టుకోవాల్సి వస్తుంది. అప్పటిదాకా సాధారణ జీవితం గడిపే రీటా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాక ఎలా స్పందించింది ? రీటా రివాల్వార్ పట్టి ఏం చేసింది? అనేది ఈ చిత్రంలో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ మార్చి లేదా ఏప్రిల్‌లో స్టార్ట్ కానుంది” అని వివరించారు.

- Advertisement -

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు