Khushi: పవర్ స్టార్ పెను విధ్వంసానికి 22 ఏళ్ళు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ పేరు టాలీవుడ్లో తెలియని వారుండరు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఫిల్మ్ ఇండస్ట్రీ లో పరిచయమై తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని యూత్ ఐకాన్ గా ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. అసలు పవన్ కళ్యాణ్ కి పవర్ స్టార్ అన్న టాగ్ నేమ్ సంపాదించి పెట్టిన సినిమా ఖుషి. ఈరోజు అనగా ఏప్రిల్ 27  ఖుషి సినిమా విడుదలై 22 యేళ్లు పూర్తయింది. ఈ సందర్బంగా ఈ చిత్ర విశేషాలను చెప్పుకుందాం.

1996లో “అక్కడ అబ్బాయి ఇక్కడ అబ్బాయి” సినిమాతో పరిచయమైన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలతో సూపర్ హిట్లు కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన తొలిప్రేమ, తమ్ముడు, బద్రి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాల తర్వాత వచ్చిందే ఖుషి. తమిళ డైరెక్టర్ s.j సూర్య దర్శకత్వంలో శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ లో ఏ.ఎం.రత్నం ఈ సినిమాను నిర్మించారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించగా భూమిక చావ్లా హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో నాజర్, విజయ్ కుమార్, సుధ, జానకి సబేష్, శివాజీ, అలీ, ముంతాజ్ కీలక పాత్రల్లో నటించారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించారు.

భారీ అంచనాల నడుమ 2001 ఏప్రిల్ 27న విడుదలయింది ఖుషి సినిమా. క్లాసిక్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని లాంగ్ రన్ లో భారీ వసూళ్లు సాధించింది ఈ సినిమా. పవన్ కళ్యాణ్ మెస్మేరైజింగ్ యాక్టింగ్ ఇంకా ఆ లాంగ్ హెయిర్, డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ అప్పట్లో యూత్ ని విపరీతంగా అట్ట్రాక్ట్ చేసాయి. ఇక ఈ సినిమాలో హీరో వాడే కాలేజ్ బ్యాగ్ అప్పట్లో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఎక్కడ చూసిన అదే హెయిర్ స్టైల్, అదే కాలేజ్ బ్యాగ్. ఇక ఈ సినిమాలో విశేషమేంటంటే ఖుషి మూవీలో ఫైట్స్ ని పవన్ కళ్యాణ్ సొంతంగా డిసైన్ చేసారు. ఇదే కాదు పవన్ కళ్యాణ్ తన చాలా సినిమాలకి తనే ఫైట్ మాస్టర్ గా ఉన్నాడు.

- Advertisement -

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన భూమిక అప్పట్లో యూత్ అందరికి ఫేవరేట్. ఇగో ఉన్న హీరోయిన్ గా అద్భుతంగా నటించింది. ఖుషి మూవీకి మెలోడీ బ్రహ్మ ఇచ్చిన పాటలన్ని సూపర్ డూపర్ హిట్లయ్యాయి. అప్పట్లో ఈ సినిమా క్యాసెట్లు ఎన్నో వేలకు వేలు అమ్ముడయ్యాయి. ఇక ఈ సినిమాలో “ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే” అనే పాటను తెలుగు ఓల్డ్ క్లాసిక్ మూవీ అయిన మిస్సమ్మ(1955) నుంచి తీసుకుని రీమిక్స్ చేసారు.

ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విడుదలైన రోజు నుంచే భారీ వసూళ్లు సాధిస్తూ కలెక్షన్ల లో రికార్డులు సాధించింది. ఆ రోజుల్లోనే ఖుషి సినిమా వరల్డ్ వైడ్ గా 22 కోట్లకి పైగా షేర్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా అప్పటి వరకు ఇండస్ట్రీ హిట్ గా ఉన్న నరసింహనాయుడు సినిమా ని చాలా చోట్ల బ్రేక్ చేసి కొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.నైజాం లో నరసింహనాయుడు సినిమా ను రెండు కోట్ల తేడా తో ఖుషి సినిమా బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. అప్పట్లో ఈ రికార్డు వల్ల నందమూరి, మెగా అభిమానుల మధ్య చాలా గొడవలు జరిగాయి.
ఖుషి సినిమా నుంచే ఇండస్ట్రీ హిట్ ను 100 రోజుల సెంటర్స్ తో కాకుండా కలెక్షన్ల తో డిసైడ్ చేయడం జరిగింది. ఖుషి సినిమా 101 కేంద్రాల్లో యాభై రోజులాడగా 79 కేంద్రాల్లో 100 రోజులాడింది. 8 కేంద్రాల్లో 175 రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడింది. ఖుషి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ కి మళ్ళీ ఆ రేంజ్ హిట్ రావడానికి 11 ఏళ్ళు పట్టింది.

అయితే ఖుషి సినిమా అభిమానుల కోరిక మేరకు చాలా ఏళ్ళ తర్వాత 2022 డిసెంబర్ 31 న మళ్ళీ విడుదలయింది. అప్పుడు కూడా ఈ సినిమా అదే జోరు చూపించి భారీ వసూళ్లు సాధించింది. రీ రిలీజ్ లో ఈ సినిమా ఏకంగా 7.30 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఖుషి తర్వాత రీ రిలీజ్ అయిన ఏ సినిమా కూడా ఈ రికార్డు ను బ్రేక్ చేయలేదు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు