Kisi ka bhai kisi ka jaan: రంజాన్ అడ్వాంటేజ్ తో వీకెండ్ కుమ్మింది. ఇక మీద ఎలా ?

బాలీవుడ్ మెగా స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సినిమా “కిసి కా భాయ్ కిసి కా జాన్”. 2017 లో వచ్చిన “టైగర్ జిందా హై” సినిమా తర్వాత మరో హిట్ లేని సల్మాన్ చాలా ఢీలా పడ్డాడు. తాను హీరోగా నటించిన భారత్, దబాంగ్ 3, రాధే సినిమా లు దారుణంగా ప్లాప్ అయ్యాయి. చివరగా షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన ‘పఠాన్’ లో స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చాడు .

ఇప్పుడు కిసి కా భాయ్ కిసి కా జాన్ సినిమా తో ఏప్రిల్ 21 న వచ్చాడు. ఈ సినిమా తెలుగు లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కాటమ రాయుడికి రీమేక్ గా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో వెంకటేష్ ప్రత్యేక పాత్రలో నటించగా, జగపతి బాబు విలన్ గా నటించాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా భూమిక చావ్లా, అభిమన్యు సింగ్, రాఘవ్, జెస్సి గిల్, పాలక్ తివారి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా లో తెలుగు కల్చర్ ని, తెలుగు మాటలని ఎక్కువగా వాడటం విశేషం.

అయితే ఈ సినిమా మొదటి రోజే డివైడ్ టాక్ ను మూట గట్టుకుంది. మూస ధోరణి లో రొటీన్ కామెడి సినిమా లాగా తీసారని బ్యాడ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే రంజాన్ కానుక గా ఈ సినిమాను రిలీజ్ చేయడం తో హాలిడే అడ్వాంటేజ్ తో ఓపెనింగ్స్ కుమ్మింది. మొదటి రోజు ఇండియా వ్యాప్తంగా 15 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే వసూలు చేసిన ఈ సినిమా రెండవ రోజు ఏకంగా 25 కోట్లు వసూలు చేసింది. అలాగే మూడో రోజు కూడా మంచి జోరు చూపించి 26 కోట్లు నెట్ కలెక్షన్లు సాధించింది. మొత్తంగా ఇండియాలో మూడు రోజుల్లో 66 కోట్లకి పైగా వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా 95 కోట్ల వరకు నెట్ వసూలు చేసింది.
మరి రంజాన్ వీకెండ్ అయిపొయింది. ఇప్పుడు డివైడ్ టాక్ తో వర్కింగ్ డేస్ లో ఎలా పెర్ఫర్మ్ చేస్తుందో అన్నది చూడాలి. దాదాపుగా అన్ని చోట్ల ఈ సినిమాకు 4 రోజు థియేటర్లు సగం కూడా ఫుల్ అవలేదు. మరి ఈ ఏడాది మరో స్టార్ హీరో సినిమా గా డిజాస్టర్ అవుతుందా, లేదా ఏదైనా అద్భుతం జరిగి మరి కొన్ని రోజులు ఆడుతుందా అన్నది చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు