Lavanya Tripathi: పెళ్ళికి సంబంధించిన ఆలోచనలు లేవు

టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచిన అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి తన అందం, అభినయంతో మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టేసింది. ఈ అమ్మడు వరుస సూపర్ హిట్ చిత్రాలను చేస్తూ అగ్ర కథానాయకగా దూసుకుపోయింది. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించింది ఈ బ్యూటీ. అయితే గతంలో మెగా హీరో వరుణ్ తేజ్ తో లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉందని, వారు పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత అవి ఫేక్ అని తేలింది.

తాజాగా ఈ అమ్మడి పెళ్లికి సంబంధించి మరోసారి వార్తలు రావడంతో స్పందించింది. ఇటీవల లావణ్య త్రిపాఠి నటించిన పులి మేక సిరీస్ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తన పెళ్లి గురించే మాట్లాడుతున్నారని, టైం వచ్చినప్పుడు అదే జరుగుతుందని చెప్పింది. అసలు పెళ్లి విషయంలో తన తల్లిదండ్రులు కూడా ఒత్తిడి చేయడం లేదని తెలిపింది. తాను పెళ్లి గురించి ఆలోచించడం లేదని, పెళ్లికి సంబంధించిన కలలు తనకు లేవని చెప్పింది.

ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలపైనే అని తెలిపింది. పెళ్లి మీద తనకు నమ్మకం ఉందని, నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి జరుగుతుందని చెప్పింది. వ్యక్తిగత విషయాల గురించి బయటకు చెప్పడం తనకు ఇష్టం ఉండదని వాక్యానించింది. కాగా లావణ్య త్రిపాఠి నటించిన పులిమేక సిరీస్ ఓటీటీలో చాలా విజయవంతంగా నడుస్తోంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు