Leo: తలపతి విజయ్ బర్త్ డే కి ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్

తలపతి విజయ్ ఫ్యాన్స్ అంత ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లియో సినిమా అప్డేట్ తొందరలోనే రానుంది. ప్రస్తుతం శర వేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకి చేరుకుంది. ఇండియాస్ మోస్ట్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమవుతోంది.

ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ కి బ్లాక్ బస్టర్ విజయాల్ని అందించిన లోకేష్ కనకరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ కి జోడిగా ఈ సినిమాలో త్రిష నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన ఖైదీ సినిమాలో సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్ ని పరిచయం చేసిన ఈ యంగ్ డైరెక్టర్ లియో సినిమాలో ఈ కాసెప్ట్ ని మరింతంగా ఎక్స్ ఫ్లోర్ చేయనున్నారు.

- Advertisement -

గతంలో సినిమాని కాసెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ రిలీజ్ చేసిన టైటిల్ ఎనౌన్స్ మెంట్ వీడియోకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో , ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే ఈ నెల (జూన్ 22)న తలపతి విజయ్ పుట్టినరోజు వస్తుండటంతో ఈ సినిమాకి సంబంధించి టీజర్ ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ టీజర్ వీడియోకి గాను లోకనాయకుడు కమల్ హాసన్ వాయిస్ ఓవర్ అందిస్తున్నారట. తొందరలోనే ఈ న్యూస్ కి సంబంధించి ఆఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది. ఈ సినిమా తరువాత విజయ్ , వెంకట్ ప్రభు దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.ఈ సినిమాకి సంబందించిన పోస్టర్ కూడా విజయ్ పుట్టిన రోజు సందర్బంగానే విడుదల అవబోతుంది. దీన్నిబట్టి చూస్తే విజయ్ తన ఫ్యాన్స్ రెండు సినిమాల అప్డేట్స్ తో ట్రీట్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు