Leo: తలపతి విజయ్ తో తెలుగు డైరెక్టర్ !

తలపతి విజయ్ అంటే ఇప్పుడు ఒక సంచలనం. ఒకప్పుడు తలపతి విజయ్ సినిమా రిలీజ్ అయితే కనీసం పట్టించుకోని తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు విజయ్ సినిమా వస్తుందట ఎగబడి చూస్తున్నారు. ఒక్క సినిమా కాస్తో కూస్తో ఆడితేనే జనాలు థియేటర్ ముందు క్యూ కడతారు అలాంటింది విజయ్ గత 5 ఏళ్లలో తేరి, కత్తి, తుపాకీ, సర్కార్, అదిరింది, బిగిల్, మాస్టర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ని డెలివరీ చేసాడు. ఇటీవల వచ్చిన వారసుడు కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు విజయ్ సినిమా వస్తుందంటే ఖచ్చితంగా హిట్ సినిమానే అని ఫిక్స్ అయిపోయారు.

మొదట్లో తెలుగు మార్కెట్ కోసం విజయ్ చాలా కష్టపడ్డాడు. కానీ ఒక్క సినిమా కూడా సరిగా ఆడలేదు. లుక్స్ పరంగా కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. విజయ్ లుక్ తమిళ్ వాళ్ళకి తప్ప తెలుగు వాళ్ళకి నచ్చదు అని కామెంట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తెలుగు హీరో  తమిళ్ హీరో అనే భావన పోయి సినిమా బాగుంటే చూడటం జనాలకి అలవాటు అయింది. దాంతో విజయ్ కి తెలుగు లో మంచి మార్కెట్ వచ్చింది. తెలుగు వాళ్ళ అభిమానానికి కృతజ్ఞతగా ఆయన తెలుగు దర్శకుడైన వంశీ పైడిపల్లి కి వారసుడు సినిమాతో అవకాశం ఇచ్చారు.

వారసుడు తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ప్రస్తుతం విజయ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో లియో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తరువాత విజయ్ ఏ సినిమా చేస్తారు అనే విషయం పై క్లారిటీ లేదు. అయితే సమాచారం ప్రకారం విజయ్ మరో తెలుగు దర్శకుడితో సినిమా చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. క్రాక్ , వీర సింహ రెడ్డి సినిమాలతో హిట్ ట్రాక్ మీద గోపీచంద్ మలినేని విజయ్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నరట. ఈ సినిమాని మైత్రి మూవీస్ నిర్మించబోతున్నారని సమాచారం. విజయ్ లియో తరువాత అట్లీ తో సినిమా చేయాల్సి ఉంది. మరి ఏ సినిమాను ముందుగా పట్టాలపైకి తీసుకెళ్తాడో చూడాలి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు