Meera Jasmine : సెకండ్ ఇన్సింగ్స్ కు ప్లాన్స్..

అన్న – చెల్లలి సెంటిమెంట్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. అందరికీ గుర్తు వచ్చే సినిమా “గోరింటాకు”. 2008లో వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించింది. యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ఈ సినిమాలో అన్న పాత్ర చేయగా, మీరా జాస్మీన్ చెల్లలి పాత్రలో కనిపించింది. ఈ సినిమాతో మలయాళి భామ మీరా జాస్మీన్ తెలుగింటి అమ్మాయి అయిపోయింది. దీని తర్వాత ఈ హీరోయిన్ చాలా అవకాశాలు వచ్చాయి. కానీ, పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైపోయింది.

ఈ సినిమా కంటే ముందు మీరా జాస్మీన్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గుడుంబా శంకర్, రవితేజ తో భద్ర వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసింది. తర్వాత గోరింటాక్ తో ఈమె క్రేజ్ మరింత పెరిగింది. అయితే ఈమె ప్రస్తుతం టాలీవుడ్ కు దూరంగా ఉంటుంది. కొన్ని రోజులు సినిమాలకే దూరంగా ఉంది.దీనికి కారణం.. ఈమె వ్యక్తిగత కారణాలే అని చెప్పొచ్చు.

ముందుగా మీరా జాస్మీన్.. ప్రముఖ సంగీత విద్వాంసుడు మాండోలిన్ రాజేష్ తో లవ్ ట్రాక్ నడిపిందని, వీరి చాలా రోజుల సహజీవనం చేశారని అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి. కానీ, ఈమె 2014లో దుబాయి కి చెందిన అనిల్జాన్ టైటాన్స్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని పెళ్లి చేసుకుంది. తర్వాత అతని నుంచి విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్న మీరా జాస్మీన్.. మలయాళంలో సెకండ్ ఇన్నింగ్స్ ను ఎంజాయ్ చేస్తోంది.

- Advertisement -

అయితే మీరా జాస్మీన్.. తెలుగులోకి కూడా రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. నేడు ఈ సీనియిర్ హీరోయిన్ 41వ పుట్టిన రోజును జరుపుకుంటుంది. ఈ సందర్భంగా తన తెలుగు రీ ఎంట్రీ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది. కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ ఈ చిత్రం తెరకెక్కబోతుంది. దీనికి విమానం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే టాలీవుడ్ లో మంచి పేరు ఉన్న ఈ సీనియిర్ హీరోయిన్, సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో చూడాలి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు